వివాదంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

19 Mar, 2023 15:21 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఏవియేషన్‌ దిగ్గజం జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో సంజీవ్‌ కపూర్‌ వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో ఉన్న మెట్రో స్టేషన్‌ల సౌందర్యం,ఆర్కిటెక్చర్‌పై (aesthetics and architecture) ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ  వైట్‌ఫీల్డ్-కేఆర్ పురం మెట్రో మార్గం (పర్పుల్ లైన్) - దుబాయ్‌ మెట్రో స్టేషన్‌ ఫోటోల్ని ఓ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లపై ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్‌ నడుస్తున్నది. 

సంజీవ్‌ కపూర్‌ భారత్‌ - దుబాయ్‌లోని మౌలిక సదుపాయాలను పోల్చారు. దుబాయ్‌ మౌలిక సదుపాయాలతో పోలిస్తే ఇండియన్‌ మెట్రోస్టేషన్‌లు ‘కళ లేని కాంక్రీటు కళ్లజోళ్లు’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే ఆ ట్వీట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవోను ట్రోలింగ్‌ చేస్తున్నారు. 


 
ఓ ట్విటర్‌ యూజర్‌ బెంగుళూరు, గుర్గావ్, కోల్‌కతాలలోని ఓవర్‌గ్రౌండ్/ఓవర్ హెడ్ మెట్రో స్టేషన్‌లు కళావిహీనంగా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ సంబంధిత మెట్రోస్టేషన్‌ ఫోటోలను పోస్ట్‌ చేశాడు. దీంతో పాటు దుబాయ్‌ మెట్రోస్టేషన్‌ కంటే భారత్‌లో మెట్రో స్టేషన్‌లు బాగున్నాయని నొక్కాణిస్తూ మరిన్ని ఫోటోల్ని షేర్‌ చేశారు. చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా అందంగా ఉన్న మెట్రోస్టేషన్‌లను, వాటి డిజైన్‌ ఫోటోల్ని ట్విటర్‌లో పంచుకుంటున్నారు.   

'అది కూడా కరెక్టే కదా సార్' 
సంజీవ్‌ కపూర్‌ అభిప్రాయాన్ని ఏకీభవించిన మరికొందరు.‘‘అది కూడా కరెక్టే కదా సార్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పర్యావరణ అనుకూలమైనది కాదు. ఖర్చుతో కూడుకున్నది. కేవలం మెట్రో స్టేషన్ మాత్రమే కాదు ఇతర పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా. ఈ రోజుల్లో ప్రైవేట్ నిర్మాణాలు సైతం అందానికి తక్కువ ప్రాముఖ్యతనిచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రధాని మోదీ చేతులు మీదిగా 
కాగా,  జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో ట్వీట్‌ చేసిన బెంగళూరులోని 13 కిలోమీటర్ల  వైట్‌ఫీల్డ్-కెఆర్ పురం మెట్రో (పర్పుల్ లైన్) రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 25న ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు