End Of Work From Home: ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం, ఆందోళనలో టెకీలు 

3 Oct, 2023 16:38 IST|Sakshi

ఐటీ దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ కాలంలో తీసుకొచ్చిన వర్క్‌ ఫ్రం హోం  విధానానికి స్వస్తి పలికేందుకు సంసిద్దమవుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్‌ అక్టోబర్ 1 నుంచి వారంలో 5 రోజులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.  ఇపుడిక విప్రో, క్యాప్‌జెమినీ  LTIMindtree   టాప్‌ కంపెనీలు వారంలో అన్ని రోజులు  లేదా సగం రోజులు ఇక  ఆఫీసుకు రావాలని   ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. 

ఎకనామిక్స్‌ టైమ్స్‌ రిపోర్ట్‌  ప్రకారం రిమోట్‌ వర్క్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రోజులు ఇక ముగిసినట్టే కనిపిస్తోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. వారానికి 5 రోజులు లేదా వారానికి 3-4 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి  చెప్పాయి.  దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన పూణె , బెంగళూరు, హైదరాబాద్‌లోని పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు మౌఖిక, అనధికారిక కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత  ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది మాత్రం ఇంకా రిమోట్‌ వర్క్‌ ఉద్యోగాల వేటలో తలమునకలై ఉన్నారు.   (మళ్లీ వార్తల్లోకి జార్ఖండ్: ఇక ఆ ఇండస్ట్రీకి తిరుగే లేదు!)

కాగా గ్లోబల్‌గా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఐటీ సంస్థలను కలవరపెడుతున్నాయి. ఆదాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి.  ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వందలమందిని లేఆఫ్స్‌ చేశాయి. కొత్త నియామకాలను దాదాపు నిలిపి వేశాయి. రానున్న కాలంలో ఇది మరింతగా ముదురుతుందనే ఆందోళనను నిపుణులువ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు