జియోబుక్ ల్యాప్‌టాప్‌ గురించి అదిరిపోయే అప్‌డేట్‌..!

7 Feb, 2022 17:06 IST|Sakshi

రిలయన్స్ జియో త్వరలో తన తొలి ల్యాప్‌టాప్‌ను దేశంలో లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఇందుకు సంబంధించిన ఒక ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఒక కొత్త నివేదిక ప్రకారం.. జియోబుక్ పేరుతో రాబోతున్న ఈ ల్యాప్‌టాప్‌కు హార్డ్ వేర్ ఆమోదపత్రం ఇటీవలే లభించింది. ఈ ల్యాప్‌టాప్‌ విండోస్ 10 ఓఎస్ సహాయంతో నడవనున్నట్లు ఆ నివేదిక తెలిపింది. అయితే ఈ ల్యాప్‌టాప్‌ను ఎమ్'డోర్ డిజిటల్ టెక్నాలజీ అనే చైనీస్ కంపెనీ తయారు చేస్తోంది. ఆ కంపెనీతో జియో చేతులు కలిపి తమ బ్రాండ్‌తో మార్కెట్లోకి లాంఛ్ చేయనున్నారు. 

ఇది ఏఆర్ఎమ్ సహాయంతో పనిచేస్తుందని ఆ నివేదిక పేర్కొంది. అంటే జియో ల్యాప్ టాప్ సరసమైన ఆఫర్ కావచ్చు. టెలికామ్ ప్రొవైడర్ యొక్క జియోఫోన్ వ్యూహం ఏదైనా ఉంటే ఇది అర్ధవంతంగా ఉంటుంది. జియోఫోన్ నెక్స్ట్ లాగా, జియో ల్యాప్‌టాప్ కూడా అతి తక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులో రానుంది. ఈ ల్యాప్‌టాప్ ఏఎమ్డీ లేదా ఇంటెల్ x86 ప్రాసెసర్‌లతో వస్తుందని సమాచారం. ఈ ల్యాప్‌టాప్‌తో పాటు టాబ్లెట్, స్మార్ట్ టీవీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. 

(చదవండి: ఆ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు..!)

మరిన్ని వార్తలు