కరూర్‌ వైశ్యా బ్యాంకు ద్వారా కస్టమ్స్‌ సుంకాల చెల్లింపు

11 Jan, 2022 08:05 IST|Sakshi

ముంబై: కస్టమ్స్‌ సుంకాలను తమ ఖాతాదారులు ఇకపై ఐస్‌గేట్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని కరూర్‌ వైశ్యా బ్యాంకు (కేవీబీ) వెల్లడించింది. ఇందుకోసం కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డుకు చెందిన ఐస్‌గేట్‌లో (ఇండియన్‌ కస్టమ్స్‌ ఎలక్ట్రానిక్‌ గేట్‌వే) లింకు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది.

ఈ పోర్టల్‌లో తమ బ్యాంకును ఎంచుకోవడం ద్వారా ఖాతాదారులు నేరుగా కస్టమ్స్‌ సుంకాలను చెల్లించవచ్చని కేవీబీ ఎండీ బి. రమేష్‌ బాబు తెలిపారు. కొత్తగా కరెంటు అకౌంటు కస్టమర్లను పెంచుకునేందుకు కూడా తమకు ఈ సదుపాయం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పన్నుల వసూళ్లకు అధీకృత బ్యాంకుల జాబితాలో సీబీఐసీ గతంలో కేవీబీని కూడా చేర్చింది. 
 

మరిన్ని వార్తలు