మార్కెట్లోకి మేడ్ ఇన్ ఇండియా లావా మొబైల్స్

7 Jan, 2021 16:48 IST|Sakshi

న్యూఢిల్లీ: మళ్లీ మొబైల్ మార్కెట్ లో మేడ్ ఇన్ ఇండియా కంపెనీల జోరు కొనసాగుతుంది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో విదేశీ కంపెనీలదే పై చేయి. ప్రధానంగా చెప్పాలంటే చైనా మొబైల్ కంపెనీలు ఈ మార్కెట్ లో దూసుకెళ్తున్నాయి. అయితే వీటిని తట్టుకొని నిలబడటానికి గతంలో మైక్రో మాక్స్ కొన్ని మొబైల్స్ విడుదల చేయగా.. తాజాగా లావా కంపెనీ తన కొత్త నాలుగు మొబైల్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. లావా జెడ్1, లావా జెడ్2, లావా జెడ్4, లావా జెడ్6 పేరుతో స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. కొత్త ఫోన్లు దేశంలోనే స్థానికంగా బ్యాటరీలు, ఛార్జర్‌లతో సహా 60 శాతం భాగాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని సంస్థ పేర్కొంది. లావా జెడ్2, లావా జెడ్4, లావా జెడ్6 మొబైల్స్ జనవరి 11 నుంచి, లావా జెడ్ 1 జనవరి 26 నుంచి అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో లభిస్తాయి.(చదవండి: శామ్‌సంగ్ నుంచి సరికొత్త బడ్జెట్‌ మొబైల్)

లావా జెడ్1 ఫీచర్స్:


డిస్‌ప్లే: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో 5-అంగుళాల డిస్‌ప్లే
ర్యామ్: 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ20
రియర్ కెమెరా: 5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,100ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.5,499

లావా జెడ్2 ఫీచర్స్:


డిస్‌ప్లే: 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
ర్యామ్: 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35 
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ + 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.6,999

లావా జెడ్4 ఫీచర్స్:


డిస్‌ప్లే: 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35 
రియర్ కెమెరా: 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ 
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ + 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.8,999

లావా జెడ్6 ఫీచర్స్:


డిస్‌ప్లే: 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35 
రియర్ కెమెరా: 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ 
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ + 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.9,999

మరిన్ని వార్తలు