వెనుకబడ్డ జెఫ్‌బెజోస్‌.. ప్రపంచానికి కొత్త కుబేరుడు..!

7 Aug, 2021 17:45 IST|Sakshi

ప్రపంచ కుబేరుల జాబితాలో తాజాగా మొదటి స్థానం నుంచి జెఫ్‌బెజోస్‌ వైదొలిగాడు. కొత్తగా ప్రపంచ నెంబర్‌ వన్‌ సంపన్నుడిగా ప్రముఖ లగ్జరీ గూడ్స్‌ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ(ఎల్‌వీఎమ్‌హెచ్‌) కంపెనీ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌  అవతరించాడు.  ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ మొత్తం నికర ఆస్తుల విలువ 198.9 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రెండో స్థానంలో జెఫ్‌ బెజోస్‌ 194.9 బిలియన్‌ డాలర్లతో కొనసాగుతున్నాడు. స్పెస్‌ ఎక్స్‌, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ 185. 5 బిలియన్ల డాలర్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆర్నాల్ట్ అంతకు ముందు డిసెంబర్ 2019, జనవరి 2020,  మే 2021 లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. తాజాగా మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించాడు. 

ఎల్‌వీఎమ్‌హెచ్‌ కంపెనీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 14 బిలియన్‌ యూరోలను ఆర్జించాడు. ఆ సమయంలో ఆర్నాల్డ్‌ ఎలన్‌ మస్క్‌ స్థానాన్ని దాటాడు. గత ఏడాది పోలిస్తే 38 శాతం మేర ఆర్నాల్డ్‌ అధికంగా ఆర్జించాడు. ఎల్‌వీఎమ్‌హెచ్‌ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 70 బ్రాండ్‌లను కలిగింది. లూయిస్‌ విట్టన్‌, సెఫోరా, టిఫనీ అండ్‌ కో, స్టెల్లా, మాక్కార్ట్నీ, గూచీ, క్రిస్టియన్‌ డియోర్‌, గివెన్చీ బ్రాండ్‌లను కలిగి ఉంది. 

మరిన్ని వార్తలు