Market Close: లాభాల్లో ముగిసిన మార్కెట్..!

11 Jan, 2022 16:08 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత పుంజుకొని లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచడం, యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రభావం మన మార్కెట్ల మీద పడటంతో ఉదయం కొద్ది సేపు నష్టాల్లో కొనసాగాయి. కంపెనీలోని మేజర్‌ వాటాను ప్రభుత్వానికి అప్పగించినట్లు అధికారికంగా వొడాఫోన్‌ ఐడియా ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఆ ప్రభావం కూడా మన మార్కెట్ల మీద పడింది. చివరకు ఐటీ, పవర్, రియాల్టీ స్టాక్స్ అండతో సూచీలు లాభాల్లో ముగిశాయి.

ముగింపులో, సెన్సెక్స్ 221.26 పాయింట్లు (0.37%) లాభపడి 60616.89 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 52.50 పాయింట్లు (0.29%) లాభపడి 18055.80 వద్ద ఉంది. హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​డీఎఫ్​సీ, టెక్​మహీంద్ర, టీసీఎస్​, రిలయన్స్​, సన్​ఫార్మా షేర్లు ప్రధానంగా లాభపడితే.. టాటా స్టీల్​, బీపీసీఎల్, బజాజ్​ ఫినాన్స్​, డాక్టర్​ రెడ్డీస్​, ఐటీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, కోటక్​ మహీంద్ర బ్యాంక్​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, పవర్, ఆయిల్ & గ్యాస్, రియాల్టీ స్టాక్లలో కొనుగోలు కనిపించింది. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి.

(చదవండి: భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తున్న కేఫ్ కాఫీ డే మాళవిక హెగ్డే..!)

మరిన్ని వార్తలు