అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతీ సుజుకీ బాలెనో కారు!

9 Dec, 2021 16:32 IST|Sakshi

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి చెందిన బాలెనో కారు అమ్మకాల్లో దూసుకెళ్తుంది. మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో ఈ ఏడాది 10లక్షల మైలు రాయిని దాటినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ కారు మార్కెట్ వాటాలో 25 శాతం వాటాను కలిగి ఉంది. నెక్సా కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బాలెనో 248 నగరాల్లోని 399 అవుట్ లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. మారుతి సుజుకి బాలెనోను 2015 అక్టోబర్ నెలలో లాంచ్ చేశారు. ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే 1 లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. 

ఈ మోడల్‌ 2018 నాటికి ఈ కారు విక్రయాలు 5 లక్షలు దాటేశాయి. ఆ తర్వాత ఐదులక్షల విక్రయాలను మూడేళ్లలోనే పూర్తి చేసుకోవడం విశేషం. "లాంఛ్ చేసినప్పటి నుంచి బాలెనో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్లలో తన సత్తా చాటుతుంది. ఇది డిజైన్, భద్రత, ఆవిష్కరణలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. 25 శాతానికి పైగా మార్కెట్ వాటాతో "బాలెనో" ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో నాయకత్వం వహిస్తున్నట్లు" అని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 

(చదవండి: 2021లో వచ్చిన బెస్ట్‌ సూపర్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..!)

బాలెనో 1.2 లీటర్ డ్యూయల్ జెట్, సెగ్మెంట్-ఫస్ట్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేసే డ్యూయల్ వీవీటి ఇంజిన్ కలిగి ఉంది. ఇది, ఐడిల్ స్టార్ట్-స్టాప్, సివిటి ట్రాన్స్ మిషన్ కలిగి ఉంది. పెట్రోల్ యూనిట్ 1.2-లీటర్ ఇంజిన్ రూపంలో 82 బిహెచ్‌పి, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవ పెట్రోల్ ఇంజన్ కొత్త 1.2-లీటర్ డ్యూయల్ జెట్ స్మార్ట్ హైబ్రిడ్ యూనిట్ రూపంలో ఉంది. ఇది 89 బిహెచ్‌పి & 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

(చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ పాటించాల్సిందే!)

మరిన్ని వార్తలు