Tesla Model 3: టెస్లాలో ఉంటే సేఫ్! కావాంటే మీరే చూడండి

11 Jun, 2022 15:56 IST|Sakshi

మొబైల్‌ టెక్నాలజీలో యాపిల్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో ఎలక్ట్రిక్‌ కారు సెగ్మెంట్‌లో టెస్లా కార్లు కూడా అదే ‍ప్రభావం చూపించాయి. క్రమం తప్పకుండా టెస్లా కార్లు ఎంత గొప్పవో తెలుసా అనే వీడియోలు అందుకు సంబంధించిన సమాచారం నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటుంది. ఈ కోవలోకి చేరే మరో వార్త ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది.

చైనాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. అంతకు ముందు బలమైన ఈదురు గాలులు వీచాయి. వాటి ధాటికి వందల ఏళ్ల నాటి పెద్ద చెట్లు కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. ఇలా నేలవాలని ఓ భారీ వృక్షం సరాసరి టెస్లా కంపెనీకి చెందని మోడల్‌ 3 కారు మీద పడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద చెట్టు మీద పడితే కారు అప్పడం అయిపోతుందని అనుకుంటాం. కానీ టెస్లా తయారీలో చూపిన  నాణ్యత కారణంగా కారు స్వల్పంగానే దెబ్బతిన్నది. పైగా అందులో ఉన్న డైవర్‌ సైతం చిన్న గాయాలతోనే సేఫ్‌గా బయటపడి అక్కడి నుంచి నడుచుకుంటు వెళ్లిపోయాడట.

ఈ సంఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. టెస్లా కారు తయారీలో ఉపయోగించిన గ్లాస్‌ రూఫ్‌ మెటీరియల్‌ ధృడత్వంపై మొదట్లో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. ప్రపంచంలో ఇదే అత్యంత సేఫ్‌ కారు అంటూ అప్పట్లో ఎలాన్‌మస్క్‌ విమర్శకులకు జవాబు ఇచ్చారు. తాజాగా ఘటనను అప్పటి మస్క్‌ వ్యాఖ్యలతో ముడిపెట్టి నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇక తాజా ఘటనపై ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. అమెరికా చట్టాల ప్రకారం దీన్ని కేవలం గాయపడటం అంటారు అనుకుంటా అంటూ చమతర్కించారు.

చదవండి:

మరిన్ని వార్తలు