అధీకృత సంస్థగా ఎంఈడీఈపీసీ

13 Jan, 2023 02:08 IST|Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచెస్, మానిటర్స్, మొబైల్స్‌ విడిభాగాల ఎగుమతికై ఎగుమతి కంపెనీలకు కావాల్సిన రిజిస్ట్రేషన్‌/మెంబర్‌షిప్‌ సర్టిఫికేట్‌ జారీ చేయడానికి.. మొబైల్, ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌కు (ఎంఈడీఈపీసీ) ప్రభుత్వం అధికారం ఇచ్చింది.

ప్రొజెక్టర్లు, టీవీలు, ప్రింటర్లు, ఫోటోకాపీయింగ్‌ మెషీన్స్‌ వంటి ఇతర ఉత్పత్తులకూ ఎంఈడీఈపీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఎగుమతి కంపెనీలు ఫారెన్‌ ట్రేడ్‌ పాలసీ కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ సర్టిఫికేట్‌ తప్పనిసరి. 

>
మరిన్ని వార్తలు