Microsoft Work From Home: ప్రముఖ టెక్ కంపెనీ ఆర్డర్.. ఇక ఉద్యోగులు ఆఫీస్‌కి రావాల్సిందే..!

15 Feb, 2022 21:10 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అనేక దేశాలలో థియేటర్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, వాణిజ్య కేంద్రాలు మెల్లగా ఓపెన్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ బదులుగా.. ఉద్యోగులు కార్యాలయాల రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ప్రముఖ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన వాషింగ్టన్, బే ఏరియా కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. వాషింగ్టన్, బే ఏరియాలోని తమ కార్యాలయాలను ఫిబ్రవరి 28న సందర్శకులు, అతిథులకు తిరిగి తెరుస్తున్నట్లు సోమవారం ఒక బ్లాగ్ పోస్ట్ తెలిపింది. 

ఆ రోజు నుంచి కార్మికులు కార్యాలయాలకు వచ్చేందుకు సిద్దంగా ఉండాలని సూచించింది. చాలా మంది వాషింగ్టన్ రాష్ట్రంలో నివసిస్తున్న ఉద్యోగులు, కింగ్ కౌంటీలోని నివాసితులలో ఎక్కువ మంది ఉద్యోగులు ఇప్పుడు కోవిడ్-19కు వ్యతిరేకంగా టీకాలు వేసుకున్నారని, ఈ ప్రాంతంలో కరోనాతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య తగ్గిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అమెరికాలోని ఇతర ప్రదేశాలలో కూడా "పరిస్థితులు అనుగుణంగా" కార్యాలయాలు త్వరలో తిరిగి తెరవబడతాయని కంపెనీ తెలిపింది. మొదటి సారి కరోనా వచ్చినప్పుడు మార్చి 2020లో కార్యాలయాలను మూసివేసిన మొదటి అతిపెద్ద సంస్థలలో మైక్రోసాఫ్ట్ ఒకటి, అప్పటి నుంచి పని చేయడానికి హైబ్రిడ్ విధానాన్ని అవలంభిస్తుంది. 

(చదవండి: ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనే పాల‌సీదారుల‌కు షాక్..!)

మరిన్ని వార్తలు