ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌.. భలే స్పీడ్‌ గురూ

7 Oct, 2020 13:12 IST|Sakshi

భారీ లాభాలతో ట్రేడవుతున్న మార్కెట్లు

మధ్య, చిన్నతరహా కంపెనీల షేర్లకు డిమాండ్‌

జాబితాలో థైరోకేర్‌ టెక్నాలజీస్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌

సొలారా యాక్టివ్‌ ఫార్మా, డాక్టర్‌ లాల్‌పాథ్‌ ల్యాబ్స్‌, టేక్‌ సొల్యూషన్స్‌

తొలుత కనిపించిన ఆటుపోట్ల నుంచి బయటపడుతూ జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 303 పాయింట్లు జంప్‌చేసి 39,877ను తాకగా.. నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 11,735 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో థైరోకేర్‌ టెక్నాలజీస్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌, టేక్‌ సొల్యూషన్స్‌, సొలారా యాక్టివ్‌ ఫార్మా, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌ చోటు సాధించాయి. ట్రేడింగ్‌ వివరాలు చూద్దాం..

థైరోకేర్‌ టెక్నాలజీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 14 శాతం దూసుకెళ్లి రూ. 1010 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,038 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 14,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.43 లక్షల షేర్లు చేతులు మారాయి.

మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 2,083 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,120 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో  గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 17,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 28,000 షేర్లు చేతులు మారాయి.

టేక్‌ సొల్యూషన్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం ర్యాలీ చేసి రూ. 48 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.09 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.31 లక్షల షేర్లు చేతులు మారాయి.

డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం లాభపడి రూ. 2,117 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,178 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 7,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 21,000 షేర్లు చేతులు మారాయి.

సొలారా యాక్టివ్‌ ఫార్మా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ఎగసి రూ. 1,174 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,249 సమీపంలో సరికొత్త గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 18,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.36 లక్షల షేర్లు చేతులు మారాయి.

మరిన్ని వార్తలు