హ్యుందాయ్‌  ఐ20 సరికొత్తగా వస్తోంది..

28 Oct, 2020 09:17 IST|Sakshi

హ్యుందాయ్‌ ఆల్‌-న్యూ ఐ20 బుకింగ్స్‌ ప్రారంభం

నవంబరు 5న  లాంచ్

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్స్‌ కంపెనీ తన ఆల్‌-న్యూ ఐ20 బుకింగ్స్‌ను బుధవారంనుంచి ప్రారంభించనుంది. ఈ మోడల్‌ను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ.21,000 బుకింగ్‌ అడ్వాన్స్‌ చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ కోసం అధికార వెబ్‌సైట్‌ను, ఆఫ్‌లైన్‌ బుకింగ్స్‌కు హ్యుందాయ్‌ డీలర్‌షిప్‌ను సందర్శించాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఎస్‌ఎస్‌ మాట్లాడూతూ... భారత్‌లో ప్రీమియం హాచ్‌బ్యాక్‌ ప్రమాణాలను మార్చే విధంగా ఈ మోడల్‌లో కొత్త టెక్నాలజీని వినియోగించామన్నారు. ఈ ఆల్‌-న్యూ ఐ20 నవంబర్‌ ఐదున భారత మార్కెట్లో విడుదల అవుతుంది. ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20  ధర 6 లక్షల నుండి 10 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు