మీకు తెలుసా.. వెహికల్ స్క్రాపింగ్‌పై క్లారిటీ వచ్చేసింది!

16 Mar, 2023 10:20 IST|Sakshi

భారతదేశంలో కొత్త వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అదే సమయంలో పాత వాహనాల వినియోగం తగ్గుతోంది, దీనివల్ల నిరుపయోగంగా ఉన్న వాహనాల సంఖ్య ఎక్కువవుతోంది. ఇలాంటి వాహనాల వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. దేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి కొంతకాలం క్రితమే స్క్రాప్ విధానాన్ని అమలులోకి వచ్చింది.

వెహికల్ స్క్రాపేజ్ విధానంలో వాహనాలను స్క్రాప్ చేయడానికి ఎటువంటి వయోపరిమితిని నిర్దేశించలేదని, 10 సంవత్సరాల వినియోగం తర్వాత వ్యవసాయ ట్రాక్టర్లను విస్మరిస్తున్నట్లు వచ్చిన నివేదికలు నిరాధారమైనవని, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ వ్యవధి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, మళ్ళీ ఒకేసారి ఐదేళ్లపాటు మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు ప్రస్తావించింది.

పది సంవత్సరాల తరువాత వినియోగంలో ఉన్న ట్రాక్టర్లను తప్పనిసరిగా స్క్రాపింగ్ చేయడం గురించి ట్విటర్, వాట్సాప్‌తో సహా కొన్ని సోషల్ మీడియాలో వెల్లడవుతున్న వార్తలు నిజం కాదని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భయాందోళనలు సృష్టించేందుకు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

(ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్‌జి, 5 సీటర్ ఇంకా..)

కొన్ని ప్రభుత్వ వాహనాలకు కాకుండా ఇతర ఏ వాహనాలకు నిర్ణీత వయోపరిమితిని భారత ప్రభుత్వం నిర్ణయించలేదు, MoRTH వాలంటరీ వెహికల్ ఫ్లీట్ ఆధునీకరణ కార్యక్రమం లేదా వాహన స్క్రాపింగ్ విధానాన్ని రూపొందించింది, దీని ప్రకారం రవాణాకు పనికి రాకుండా ఉండే వాహనాలను స్క్రాప్ చేయవచ్చు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా పరీక్షించిన తర్వాత వాహనం ఫిట్‌గా ఉన్నంత వరకు రోడ్డుపై నడపవచ్చని నివేదికలు చెబుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు