CNN layoffs షాకింగ్‌: ఉద్యోగులకు ముప్పు నేడో, రేపో నోటీసులు!

1 Dec, 2022 11:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థికమాంద్యం ప్రమాదం ఉద్యోగులు మెడకు చుట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికే టెక్‌, ఐటీ దిగ్గజాలు ఉద్యోగులు ఉపాధిపై దెబ్బకొట్టాయి.ఆదాయాలు తగ్గిపోవడం,  ఖర్చులను  తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల కోత ఆందోళన కొన సాగు తుండగానే తాజాగా ఈ భారీ తొలగింపుల సీజన్ సెగ మీడియా బిజినెస్‌ను తాకింది.(జొమాటోకు అలీబాబా ఝలక్‌, భారీగా షేర్ల అమ్మకం)

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ యాజమాన్యంలోని సీఎన్‌ఎన్‌ ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ మేరకు నెట్‌వర్క్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ లిచ్ట్ బుధవారం మొత్తం టీమ్‌కు అంతర్గత సందేశంలో ఉద్యోగులను హెచ్చరించారు. ప్రధానంగా పెయిడ్‌ కాంట్రిబ్యూటర్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ట్వీట్‌ చేశారు.  పొంచి ఉన్న మాంద్యం, పెరుగుతున్న స్ట్రీమింగ్ ఖర్చులను తగ్గించుకునేలా డిస్నీ ఉద్యోగుల తొలగింపులు,  నియామక స్తంభన, ఇతర వ్యయాలను తగ్గించే కార్యక్రమాలను కూడా  ప్రకటించింది. (వారికి భారీ ఊరట: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు)

ఆర్థికరంగ మందగమనం ప్రభావాన్ని ఎదుర్కొనే క్రమంలో వ్యయాలను నియంత్రించు కునేందుకు ప్రధానంగా ఉద్యోగాల్లోనే కోత విధిస్తున్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, యాడ్ మార్కెట్ మందగింపుతో  మీడియా వ్యాపారం కూడా దెబ్బతింటోంది.  ఫలితంగా ఉద్యోగుల తొలగింపులు, నియామకాలు నిలిపివేత లాంటి ఇతర ఖర్చు తగ్గించే చర్యలను మీడియా సంస్థలు ప్రకటించాయి. సీబీఎస్‌, ఎంటీవీ, వీహెచ్‌1 లాంటి అనేక ఇతర నెట్‌వర్క్‌లను నిర్వహిస్తున్న మరో మీడియా పవర్‌హౌస్, పారామౌంట్ గ్లోబల్ ఇటీవల ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.  (శాంసంగ్‌ గుడ్‌ న్యూస్‌: భారీ ఉద్యోగాలు)

మరిన్ని వార్తలు