ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు..ఇక పండగే!

18 Aug, 2022 11:56 IST|Sakshi

సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని  ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకోసం మరో చక్కటి వెసులుబాటును కల్పిస్తోంది. ఇకపై రీల్స్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం మరింత సులువు కానుంది. అంతేనా ఈ క్రమంలో వీడియో క్రియేటర్లు కోసం ఏకంగా మూడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ నుండి ఫేస్‌బుక్‌కి క్రాస్-పోస్టింగ్‌తో సహా రీల్స్‌కు కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

యూజర్ల అభిరుచులకు అనుగుణంగా అప్‌డేటెడ్‌ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఇన్‌స్టా ప్రస్తుత ట్రెండ్‌ను క్యాష్‌ చేసుకుంటోంది.  ముఖ్యంగా ఇన్‌స్టా రీల్స్‌కు వస్తున్న భారీ క్రేజ్‌ నేపథ్యంలో నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఫేస్‌బుక్‌కు రీల్స్‌ను క్రాస్ పోస్టింగ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతోపాటు స్టోరీస్‌లో పాపులరైన ‘యాడ్‌ యువర్స్‌ స్టిక్కర్‌’ ఫీచర్‌ను రీల్స్‌లోనూ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక మూడవదిగా ఎఫ్‌బీలో రీల్స్‌ రీచ్‌, యావరేజ్‌ వ్యూస్‌ టైం, టోటల్‌ వ్యూస్‌టైంను తెలుసుకునే అవకాశం కూడా యూజర్లకు కలగనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్లకు  అందుబాటులోకి తీసుకురానుంది. (ప్రత్యేక డిపాజిట్‌ స్కీమ్‌: లక్ష డిపాజిట్‌ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!)

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ హెడ్ ఆడమ్ మొస్సేరి కొత్త రీల్స్ అప్‌డేట్స్‌ను ప్రకటించారు. స్టోరీస్‌లో పాపులర్ అయిన యాడ్ యువర్స్ స్టిక్కర్,  ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌  కోసం  రీల్స్‌  ఫీచర్‌ అప్‌డేట్‌ వస్తోందని మొస్సేరి  వెల్లడించారు. అలాగే యాడ్‌ యువర్స్‌ స్టిక్కర్‌, ఐజీ-ఎఫ్‌బీ క్రాస్‌ పోస్టింగ్‌, ఎఫ్‌బీ రీల్స్‌ ఇన్‌సైట్స్‌ అనే మూడు ఫీచర్లు అందిస్తు‍న్నట్టు  ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు