ఈ పెట్టుబడి పథకాలతో జాగ్రత్త: ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక 

25 Apr, 2023 12:23 IST|Sakshi

న్యూఢిల్లీ: కచ్చితమైన రాబడులు ఇస్తామంటూ ముగ్గురు వ్యక్తులు ఆఫర్‌ చేస్తున్న పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయ వద్దంటూ పెట్టుబడిదారులకు ఎన్‌ఎస్‌ఈ హెచ్చరిక జారీ చేసింది. వీణ, అంకితా మిశ్రా, విషాల్‌ అనే వ్యక్తులు ఈ తరహా పెట్టుబడి పథకాలను ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది. ((2023-24లో రుణ వృద్ధి 10 శాతమే: నోమురా అంచనా

(ఇదీ చదవండి: బేబీ షవర్‌: ఉపాసన పింక్‌ డ్రెస్‌ బ్రాండ్‌, ధర ఎంతో తెలుసా?)

వీరు ఎన్‌ఎస్‌ఈ వద్ద సభ్యులుగా లేదా అధికారిక వ్యక్తులుగా నమోదు చేసుకోలేదని ఎన్‌ఎస్‌ఈ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్‌ ఖాతా వివరాలు (యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌) వీరితో పంచుకోవద్దని కోరింది. స్టాక్‌ మార్కెట్లో కచ్చితమైన రాబడులు అంటూ వీరు ఆఫర్‌ చేసే ఎలాంటి పథకం అయినా, ఉత్పత్తిలో, సంస్థలో ఇన్వెస్ట్‌ చేయవద్దని సూచించింది. ఒకవేళ పెట్టుబడులు పెడితే అది ఇన్వెస్టర్లు స్వీయ రిస్క్‌ తీసుకున్నట్టుగా పరిగణించాలని కోరింది. ఈ విషయంలో ఎన్‌ఎస్‌ఈకి ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేసింది. (శ్యామ్‌ స్టీల్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ)

మరిన్ని వార్తలు