3 గిగావాట్ల సామర్థ్యానికి ఎన్‌టీపీసీ

22 Dec, 2022 06:24 IST|Sakshi

న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో 3 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నట్టు ఎన్‌టీపీసీ వెల్లడించింది. రాజస్తాన్‌లోని బికనీర్‌ వద్ద నోఖ్రా సోలార్‌ పీవీ ప్రాజెక్టులో 100 మెగావాట్లు తోడవడంతో డిసెంబర్‌ 20న ఈ ఘనతను సాధించామని ప్రకటించింది. 2022 జూన్‌ 24న ఎన్‌టీపీసీ గ్రూప్‌ 2 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది.

12 రాష్ట్రాల్లో సంస్థ ఖాతాలో 36 ప్రాజెక్టులకుగాను 3,094 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. కొత్తగా 4.8 గిగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియలో మరో 7.3 గిగావాట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలన్నది ఎన్‌టీపీసీ లక్ష్యం.  

మరిన్ని వార్తలు