ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్ప్లస్ త్వరలో 9 ఆర్టీ పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ తీసుకొని రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన కొన్ని ఆసక్తికర స్పెసిఫికేషన్లను కొందరు టిప్ స్టార్ హీరోలు బయటకి లీక్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చే నెల అక్టోబర్ మధ్యలో లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చివరి స్మార్ట్ఫోన్ ఇది. ఈ స్మార్ట్ఫోన్ శక్తివంతమెన స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు తెలుస్తుంది.
వన్ప్లస్ 9 ఆర్టీ అక్టోబర్ 15న లాంచ్ కానున్నట్లు ప్రముఖ టిప్ స్టార్ స్టీవ్ హెమ్మర్ స్టాఫర్(@onleaks) ట్వీట్ చేశారు. దీనిని వన్ప్లస్ ధృవీకరించలేదు. ఈ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. వన్ప్లస్ 9 ఆర్టీ 8జీబీ + 128జీబీ వేరియెంట్ ధర సీఎన్వై 2,999(సుమారు రూ.34,300), 8జీబీ + 256జీబీ వేరియెంట్ ధర సీఎన్వై 3,299(సుమారు రూ.37,700)కు విడుదల కావచ్చు అని తెలుస్తుంది.(చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపు ఈ సేవలకు అంతరాయం)
వన్ప్లస్ 9 ఆర్టీ ఫీచర్స్(అంచనా)