పాన్‌ - ఆధార్‌ అనుసంధానానికి గడువు పొడిగింపు

28 Mar, 2023 17:15 IST|Sakshi

పాన్‌ - ఆధార్‌ లింక్‌ చేశారా? లేదంటే వెంటనే చేయండి’ అంటూ కేంద్రం మార్చి 31,2023 వరకు గడువు విధించింది. తాజాగా ఆ గడువును జూన్‌ 30,2023 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపు దారులకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ అధికారికంగా ట్వీట్‌ చేసింది. 

   

ఈ సందర్భంగా  పాన్‌ - ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపుపై కేంద్రం ఆర్ధిక శాఖ స్పందించింది. జూన్‌ 30, 2023 లోపు  పాన్‌ -ఆధార్‌ అనుసంధానం చేయాలని, లేదంటే పాన్‌ కార్డ్‌ పని చేయదని స్పష్టం చేసింది.  
 
♦ అంతేకాదు పాన్‌ కార్డ్‌ నిరుపయోగమైతే చెల్లింపులు నిలిచిపోతాయి.  

♦ పాన్‌ కార్డ్‌ పని చేయని కాలానికి వడ్డీలు పొందలేరు.  

♦ చట్టం ప్రకారం.. టీడీఎస్‌, టీసీఎస్‌లు ఎక్కువ రేటుతో తొలగించడం /సేకరించడం జరుగుతుంది.  

కాగా, ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ట్వీట్ చేసింది. పాన్ కార్డ్ - ఆధార్ కార్డ్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2023 అని ట్వీట్‌ చేసింది. ‘ఐటీ చట్టం, 1961 ప్రకారం, పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను ఆధార్‌ కార్డ్‌కు లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే 1.4.2023 నుండి పాన్‌ కార్డ్‌లు పనిచేయవని స్పష్టం చేసింది. తాజాగా అనుసంధానానికి గడువు పొడిగింపుతో వినియోగదారులు ఊరట లభించినట్లైంది. 

చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం!..రేషన్‌ కార్డు దారులకు గుడ్‌న్యూస్!

మరిన్ని వార్తలు