కనీవినీ ఎరుగని రీతిలో కార్ల అమ్మకాలు.. దుమ్మురేపిన ఫిబ్రవరి సేల్స్

10 Mar, 2023 18:26 IST|Sakshi

భారతదేశంలో కార్లను వినియోగించేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది, ఈ కారణంగా రోడ్డుపైన తిరిగే కార్ల సంఖ్య కూడా తారా స్థాయికి చేరుకుంటోంది. మునుపటితో పోలిస్తే సొంతంగా కార్లను కలిగి ఉన్న వారు ఇప్పుడు చాలానే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) అందించిన నివేదికల ప్రకారం, 2023 ఫిబ్రవరిలో మాత్రం సుమారు 2.92 లక్షల ప్యాసింజర్ వాహనాలు విక్రయించారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్యాసింజర్ వాహనాలకున్న డిమాండ్ ఇట్టే అర్దమైపోతోంది.

నిజానికి గత నెలలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,91,928 యూనిట్లు. 2022లో విక్రయించబడ్డ 2,62,984 యూనిట్లతో పోలిస్తే ఈ అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ఇందులో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) కూడా ఉన్నాయి. వ్యాన్ల అమ్మకాలు గత ఫిబ్రవరిలో 11,489 యూనిట్లు.

మొత్తం అమ్మకాలలో మారుతి సుజుకి సేల్స్ 1,02,565 యూనిట్లు. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 99,398 యూనిట్లను విక్రయించి, 3 శాతం తగ్గుదలను నమోదు చేసింది. హ్యుందాయ్ కంపెనీ 24,493 యూనిట్లను విక్రయించి భారీ వృద్ధిని కైవసం చేసుకుంది.

(ఇదీ చదవండి: టాటా కార్లు కొనేవారికి శుభవార్త.. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అంతకుమించిన బెనిఫీట్స్)

ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2022లో 10,50,079 యూనిట్లు, కాగా 2023 ఫిబ్రవరిలో ఈ అమ్మకాలు 8 శాతం పెరిగి 11,29,661 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ వీలర్ సేల్స్ కూడా 86 శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

మరిన్ని వార్తలు