ఆర్‌బీఐ కార్యాలయాల ముందు క్యూ

14 Oct, 2023 04:32 IST|Sakshi

19 కేంద్రాల్లో రూ. 2 వేల నోట్ల మారి్పడి

న్యూఢిల్లీ: రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కార్యాలయాల ముందు జనం బారులు దీరారు. రూ.2 వేల నోట్ల డిపాజిట్‌ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్‌ 7 వరకు అందించాయి. అక్టోబర్‌ 8 నుంచి ఈ సేవలను దేశవ్యాప్తంగా 19 ఆర్‌బీఐ కార్యాలయాలు కొనసాగిస్తున్నాయి. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు 2023 మే 19న ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మార్పిడి, డిపాజిట్‌కు సెపె్టంబర్‌ 30 వరకు అనుమతించారు. ఆ తర్వాత ఆఖరు తేదీని అక్టోబర్‌ 7 వరకు పొడిగించారు. ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు.

బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. వ్యవస్థ నుంచి రూ.3.43 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గత శుక్రవారం వెల్లడించారు. రూ.12,000 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ చలామణిలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్‌బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది. 

మరిన్ని వార్తలు