రిలయన్స్ రీటైల్‌లో మరో భారీ పెట్టుబడి

5 Nov, 2020 17:10 IST|Sakshi

ఆర్‌ఆర్‌విఎల్లో పీఐఎఫ్ పెట్టుబడులు

9 555 కోట్ల రూపాయల డీల్

రిలయన్స్ రీటైల్‌లో మరో భారీ పెట్టుబడి 

సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) మరో భారీ పెట్టుబడిని సాధించింది. ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటైన సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) 2.04 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. దీంతో రిలయన్స్‌ రీటైల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి  వచ్చిన ఎనిమిదవ పెట్టుబడిగా ఇది నిలిచింది.  (కరోనా : లక్ష కోట్ల అంబానీ సంపద ఆవిరి)

భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చెయిన్‌ రిలయన్స్‌ రీటైల్‌తో చేసుకున్న ఈ ఒప్పందం విలువ .9,555 కోట్ల రూపాయలని(సుమారు 3 1.3 బిలియన్లు) అని రిలయన్స్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాడీల్తో రిలయన్స్ రీటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 4.587 లక్షల కోట్లు (సుమారు 62.4 బిలియన్లు)గా ఉండనుంది. సౌదీతో తమకు దీర్ఘకాల సంబంధం ఉందనీ, భారత రిటైల్ రంగంలో విశేష మార్పులకు ఇదొక ప్రతిష్టాత్మక ప్రయాణమంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్‌ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి భారతదేశ ఆర్థికవ్యవస్థను, పీఐఎఫ్‌ ఉనికిని మరింత బలోపేతం చేస్తుందన్నారు.

ఆర్‌ఆర్‌విఎల్‌ ఇప్పటివరకు 10.09 శాతం వాటాలను 47,265 కోట్ల రూపాయలకు విక్రయించింది. సింగపూర్ సావరిన్ వెల్త్‌ఫండ్ జీఐసీ, టీపీజీ అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ముబదాలాఇన్వెస్ట్‌మెంట్ కో, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్‌, సిల్వర్ లేక్ (రెండుసార్లు) సంస్థలనుంచి పెట్టుబడులనుసాధించిన సంగతి తెలిసిందే. కాగా పీఐఎఫ్‌ ఇంతకుముందు రిలయన్స్‌ టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్‌లలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు