ఇక ఎక్కువ సేపు పని చేయాలంటే.. జరిమానా కట్టాల్సిందే!

11 Nov, 2021 19:59 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సంస్థలు ఉద్యోగుల పని సమయం దాటిన తర్వాత కూడా ఎక్కువ సేపు పని చేయాలని ఒత్తిడి చేస్తుంటాయి. మరోకోన్ని సంస్థలు ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కాల్ చేసి మరి పని చేయాలని ఉద్యోగులకు చిరాకు తెప్పిస్తాయి. ఇలాంటి, కష్టాలు మీకు కలిగితే పోర్చుగల్ దేశానికి వెళ్ళండి. ఎందుకంటే, ఉద్యోగులకు ఇటువంటి వాటి నుంచి ఉపశమనం పొందేలా పోర్చుగీస్ పార్లమెంట్ కొత్త కార్మిక చట్టాన్ని ఆమోదించింది. పోర్చుగల్ సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆఫీసు పని అయిపోయిన తర్వాత ఉద్యోగులను పనిచేయాలనే కోరితే ఆ యజమానులకు జరిమానా విధించవచ్చు. 

వర్క్ ఫ్రమ్ హెం చేసిన సమయంలో కూడా సమయం దాటిన తర్వాత పని చేయించుకోకూడదు. ఇంటి నుంచి పనిచేసేటప్పుడు అయ్యే గ్యాస్, ఇంటర్నెట్, విద్యుత్ బిల్లులు వంటి పెరిగిన ఖర్చులను తమ సిబ్బందికి యజమానులు చెల్లించాల్సి ఉంటుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పనిచేసే కొత్త సంస్కృతి కారణంగా అనేక ఇళ్లు తాత్కాలిక కార్యాలయాలుగా మారాయి. ఇంకా పిల్లలతో ఉన్న ఉద్యోగులకు వారి పిల్లలు 8 ఏళ్లు వచ్చే వరకు ఇంటి నుంచి పని చేయడానికి చట్టపరమైన రక్షణలు ఇచ్చింది. మెరుగైన పని-జీవిత సమతుల్యతను నెలకొల్పడానికి ఈ చట్టం తీసుకొచ్చామని కార్మిక, సామాజిక భద్రత మంత్రి అనా మెండెస్ గోడిన్హో పేర్కొన్నారు. పది మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.

(చదవండి: మార్క్‌ జుకర్‌బర్గ్‌పై తీవ్ర విమర్శలు.. ఇన్‌స్టాగ్రామ్‌.. టేక్‌ ఏ బ్రేక్‌!)

మరిన్ని వార్తలు