ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!

19 Jul, 2021 18:58 IST|Sakshi

ఎస్‌బీఐ తన బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ తో తప్పనిసరిగా సెప్టెంబర్ 30, 2021లోపు లింక్ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులను కోరింది. "ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆధార్ నంబర్ ను, శాశ్వత ఖాతా నంబర్(పాన్)తో 30 సెప్టెంబర్ 2021 నాటికి లింక్ చేయడం తప్పనిసరి" అని ఎస్‌బీఐ తెలిపింది. అయితే, ఖాతాదారులకు ఈ విషయాన్ని గుర్తు చేయడానికి బ్యాంకు కొన్ని రోజులుగా ట్వీట్ చేస్తూనే ఉంది. 

ఒకవేల ఖాతాదారులు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ తో లింకు చేయడంలో విఫలమైతే వారి బ్యాంక్ సేవల విషయంలో అంతరాయం ఇబ్బందులు ఎదుర్కొంటారని రుణదాత తెలిపారు. " ఎటువంటి అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలను ఆస్వాదించడానికి పాన్ నెంబర్ ను, ఆధార్ తో లింక్ చేయమని మా కస్టమర్లకు మేము సలహా ఇస్తునాము" అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి దృష్ట్యా పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసే గడువును గత నెలలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడగించిన విషయం తెలిసిందే. గతంలో ఈ గడువును మార్చి 30 నుంచి జూన్ 30 వరకు పొడగించారు. మీ పాన్ ను ఆధార్ తో లింక్ చేయడం కొరకు మీరు www.incometax.gov.in ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి లింకు చేయాల్సి ఉంటుంది.

ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ తో పాన్ ను లింక్ చేయవచ్చు. దీని కొరకు మీరు UIDPAN<12 Digit Aadhaar Number><10 Digit PAN> ఫార్మెట్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 567678 లేదా 56161కు ఎస్ఎమ్ఎస్ పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి పాన్-ఆధార్ ని గడువు తేదీ నాటికి లింక్ చేయడంలో విఫలమైనట్లయితే, అప్పుడు అతడు/ఆమె గరిష్టంగా రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు