జియో-ఫేస్‌బుక్ డీల్‌: రిలయన్స్‌కు ఝలక్‌

21 Jun, 2022 10:35 IST|Sakshi

సాక్షి,ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)కు భారీ షాక్‌​ తగిలింది. జియో-ఫేస్‌బుక్ డీల్‌కు సంబంధించి  ఫెయిర్ డిస్‌క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో ఇద్దరు అధికారులపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) కొరడా ఝుళిపించింది.  రిలయన్స్‌,  సావిత్రి పరేఖ్, కె సేతురామన్‌కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సెబీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ జరిమానాను 45 రోజుల్లోగా సంయుక్తంగా, లేదా వేర్వేరుగా చెల్లించాలని ఆదేశించింది. 

జియో-ఫేస్‌బుక్ డీల్‌కు సంబంధించిన వార్తలు 2020 మార్చి 24, 25 తేదీల్లో మీడియాలో వెలువడ్డాయని,  9.99 శాతం వాటా కొనుగోలుకు ఫేస్‌బుక్‌ రూ. 43,574 కోట్ల పెట్టుబడులను  సమీకరించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని  మీడియాకు విడుదల చేసిన  తరువాత కూడా ఇవ్వలేదనీ, రెగ్యులేటరీ సెబీకి సమాచారం అందించాల్సిన బాధ్యత ఉందని రిలయన్స్‌పై ఉందని  సెబీ పేర్కొంది.  అయితే ఆలస్యంగా 2020 ఏప్రిల్22న ఎక్స్ఛేంజీలకు అందించిందనీ తెలిపింది. ఈ 28 రోజుల ఆలస్యానికి జరిమానా విధించామని సెబీ అధికారి బర్నాలీ ముఖర్జీ తన ఉత్తర్వులో తెలిపారు.

ఈ వార్తలతో రిలయన్స్‌ షేరు మంగళవారం మార్కెట్‌ ఆరంభంలో భారీగా నష్టపోయింది. ప్రస్తుతం స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. మరోవైపు  సెబీ జరిమానాపై రిలయన్స్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు