సెన్సెక్స్‌,  నిఫ్టీ హైజంప్‌

16 Aug, 2022 10:17 IST|Sakshi

60వేలకు మార్క్‌కు సమీపంలో సెన్సెక్స్‌ 

17800 దాటేసిన నిఫ్టీ

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఆసియా మర్కెట్ల సానుకూల సంకేతాలు, మూడు రోజుల విరామం అనంతరం ట్రేడర్లు ఉత్సాహంగాఉన్నారు.  దీంతో కీలక సూచీలు ప్రధాన మద్దతు సస్థాయిలకు ఎగువన టట్రేడ్‌ అవుతున్నాయి.సెన్సెక్స్ 426 పాయింట్లు ఎగిసి 59879 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 17824 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బ్యాంక్ ఇండెక్స్, నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి  భారీగా లాభపడుతున్నాయి. 

అదానీ ప్టోరర్ట్స్‌, ఐషర్‌ మోటార్స్‌, ఆసియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ ఎన్యసూరెన్స్‌, హీరో మోటా లాభాల్లో ఉన్నాయి.  ఇంకా యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, HDFC బ్యాంక్, నెస్లే ఇండియా, HDFC, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్యూఎల్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ BSE టాప్‌లో ఉన్నాయి. టాటా స్టీల్  లాభపడుతున్నాయి. అయితే  గ్రాసిం, ఓఎన్జీసీ, హిందాల్కో, భారతి ఎయిర్‌ టెల్‌, సన్‌ ఫార్మ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు  'పార్సీ న్యూ ఇయర్' కారణంగా ఫారెక్స్ , మనీ మార్కెట్లు మంగళవారం పనిచేయవు.

మరిన్ని వార్తలు