లాభాలతో మొదలై... నష్టాల్లోకి..!

27 Jul, 2020 09:36 IST|Sakshi

సూచీలను కట్టడి చేస్తున్న బ్యాంక్‌ షేర్ల పతనం

2శాతం నష్టపోయిన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు

సూచీలకు అండగా రిలయన్స్‌ ర్యాలీ

దేశీయ మార్కెట్‌ సోమవారం లాభాలతో మొదలై... క్షణాల్లో నష్టాల్లోకి మళ్లింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్‌ 50 పాయింట్లు పెరిగి 38179 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,213 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే బ్యాంకింగ్‌ రంగ షేర్లల్లో నెలకొన్న అమ్మకాలు సూచీలను నష్టాల్లోకి మళ్లించాయి. ఫలితంగా ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 66 పాయింట్లను కోల్పోయి 38062 వద్ద, నిఫ్టీ 17పాయింట్ల నష్టంతో 11176 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.50-1.50శాతం నష్టాలను చవిచూడటంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం నష్టంతో 22,664 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియల్టీ రంగ షేర్లు సైతం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, మెటల్‌, మీడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ శుక్రవారం వెల్లడించిన క్యూ1 ఫలితాలు బాగున్నాయి. నేడు కోటక్‌బ్యాంక్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జూలై 21-23 తేదీల మధ్య రూ.842.7 కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు తెలుస్తోంది.

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు సూచీల ర్యాలీని కట్టడి చేస్తున్నాయి. అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.50-1.50శాతం నష్టాలను చవిచూడటంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం నష్టంతో 22,664 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫలితంగా ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 66 పాయింట్లను కోల్పోయి 38062 వద్ద, నిఫ్టీ 17పాయింట్ల నష్టంతో 11176 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియల్టీ రంగ షేర్లు సైతం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, మెటల్‌, మీడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ శుక్రవారం వెల్లడించిన క్యూ1 ఫలితాలు బాగున్నాయి. నేడు కోటక్‌బ్యాంక్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జూలై 21-23 తేదీల మధ్య  రూ.842.7 కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు తెలుస్తోంది.  

అదానీపోర్ట్స్‌, యూపీఎల్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. టాటాస్టీల్‌, ఏషియన్‌ పేయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు