తగ్గేదేలే .. రాకెట్‌లా మార్కెట్లు రయ్‌..రయ్‌..

30 Aug, 2022 15:35 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. సోమవారం నాటి పతనంనుంచి భారీగా కోలుకున్న మార్కెట్లు  మంగళవారం ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసాయి. రోజంతా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాయి.  ఒక దశంలో సెన్సెక్స్‌ 1600 పాయింట్లకు పైగా జంప్‌ చేసింది.  చివరికి సెన్సెక్స్‌  1564 మార్కెట్లు ర్యాలీ అయ్యి 59537 వద్ద, నిఫ్టీ 446 పాయింట్ల లాభంతో 17759 వద్ద స్థిరపడ్డాయి. 

రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్‌ ఇలా అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. నిఫ్టీలో అసలు నష్టపోయిన షేర్‌ లేదంటే ఆశ్చర్యం లేదు.  బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్‌ మహీంద్ర, టీసీఎస్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, మారుతి యాక్సిస్‌  టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.  రేపు (బుధవారం)  వినాయక చవితి సందర్భంగా మార్కెట్లు మూత పడతాయి. షార్ట్‌ కవరింగ్‌ ప్రభావితం చేసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు.  మరోవైపు రూపీ డాలరు మారకంలో 63పైసలు ఎగిసి 79.45 వద్ద  ముగిసింది.  

మరిన్ని వార్తలు