కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చిన టాటా మోటార్స్‌..!

28 Jul, 2021 16:05 IST|Sakshi

ముంబై: ప్యాసింజర్‌ వాహన కొనుగోలుదారులకు టాటా మోటార్స్ మరోసారి షాక్‌ ఇచ్చింది. వచ్చేవారం నుంచి టాటా మోటార్స్‌కు చెందిన ప్యాసింజర్‌ వాహనాల ధరలను పెంచాలని కంపెనీ చూస్తోంది. స్టీల్, ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగడంతో సేకరణ వ్యయాన్ని భారీగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ మార్కెట్లో టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వంటి ప్యాసింజర్‌ వాహనాలను టాటా మోటర్స్‌ విక్రయిస్తుంది.

టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ శైలేష్‌ చంద్ర మాట్లాడుతూ...గత ఏడాది నుంచి స్టీల్‌, విలువైన లోహల ధరల్లో గణనీయమైన పెరుగుదలను చూశామన్నారు. గత ఏడాది కాలంలో కంపెనీ ఆదాయాలలో 8-8.5 శాతం వరకు వస్తుధరలు భారీగా పెరిగాయని తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని కంపెనీ ఎదుర్కోన్నట్లు పేర్కొన్నారు.
కంపెనీ దృష్టిలో కేవలం 2.5 శాతం మాత్రమే ఇన్‌పుట్‌ ఖర్చులను పెంచగా, షోరూమ్ కోణంలో ఇది దాదాపు 3 శాతంగా ఉండనుందని పేర్కొన్నారు.

కస్టమర్లకు పెద్ద మొత్తంలో ధరల పెంపును నివారించాలనుకుంటున్నందున వివిధ వ్యయ తగ్గింపు కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాల ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించగలిగామని  చంద్ర పేర్కొన్నారు. ఇన్‌పుట్‌ వ్యయాల మధ్య ఇంకా అంతరం మిగిలి ఉండటంతో  కచ్చితంగా వాహనాల ధరలను పెంచాల్సి వస్తోందని తెలిపారు. కంపెనీ పలు మోడళ్ల రివైజ్‌డ్‌ ధరలను రూపోందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను ఎదుర్కోవటానికి ఇతర మోడళ్ల హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్,  సిఎన్‌జి వేరియంట్ల ధరలను సుమారు రూ .15 వేల వరకు పెంచింది.
 

మరిన్ని వార్తలు