లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు, జోరును కొనసాగిస్తున్న బ్యాంక్‌ షేర్లు

11 Aug, 2021 09:38 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్‌లో ​ బ్యాంక్‌,ఆటో,మెటర్ల షేర్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. బుధవారం మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. దేశీయ మార్కెట‍్ల ప్రభావం అనుకూలంగా ఉండడంతో మార‍్కెట్లు ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో దేశీ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా పాయింట్లు పెరిగాయి. దీంతో బుధవారం మార‍్కెట్‌ 9.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 32.99 పాయింట్లతో(0.8%)  54,599.50 ట్రేడ్‌ అవుతుండగా నిఫ్టీ 20.20 పాయింట్లు (0.12%) పెరిగి 16,300 వద్ద ట్రేడింగ్‌ ను కొనసాగిస్తుంది

టాటాస్టీల్‌, ఎన్టీపీసీ, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మారుతి సుజూకి లాభాల్లో ఉండగా టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, నెస్టల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.  కార్‌ట్రేడ్‌ టెక్‌, నువోకో విస్టాస్‌ కార్పోరేషన్‌ సబ్‌స్క్రిప్షన్లు ఈ రోజుతో ముగుస్తున్నాయి,


 

మరిన్ని వార్తలు