వాహనదారులకు షాక్‌?.. పెరగనున్న టోల్‌ చార్జీలు.. ఎంతంటే?

29 Mar, 2023 17:15 IST|Sakshi

వాహనదారలు నెత్తిన టోల్‌ బాదుడుకు రంగం సిద్ధమైంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ ఛార్జీలను సమీక్షిస్తుంది. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 శాతం మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త రేట్ల లిస్టును ఎన్‌హెచ్‌ఏఐ ఈరోజు రాత్రి లేదా రేపు విడుదల చేయనుంది.  

2008 నేషనల్‌ హైవేస్‌ ఫీజ్‌ ప్రకారం.. ప్రతి ఏడు కేంద్ర రవాణ శాఖ టోల్‌ ఛార్జీల పెంపుపై కొన్ని ప్రతిపాదనలు తెస్తుంది. ఆ ప్రతిపాదనలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 

దీని ప్రకారం కార్లు, తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పుకు ఐదు శాతం, భారీ వాహనాలకు టోల్ టాక్స్ అదనంగా 10 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం టోల్ టాక్స్ లను పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

చదవండి: టోల్‌ప్లాజా, ఫాస్టాగ్‌ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!

మరిన్ని వార్తలు