మమ్మల్ని నమ్మండి.. వాట్సాప్‌ క్లారిటీ

12 Jan, 2021 11:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత వివరాలు అడుగుతుందని.. ఫోన్లు, సందేశాలు స్టోరేజీ చేసుకుంటుందని.. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు పక్కదారి పడుతున్నాయని వాట్సాప్‌పై వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లనీ.. వాటికి తాము సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని వాట్సాప్‌ తెలిపింది. దీంతో మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా వాట్సాప్‌ స్పష్టత ఇచ్చింది. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ వదంతుల కారణంగా వారం రోజుల్లోనే వాట్సప్‌ను అన్‌ ఇన్‌స్టాల్‌ చేయడం.. అన్‌లైక్‌ చేయడం చేస్తున్నారు. వాట్సప్‌ వినియోగం ఆపేసి మిగతా యాప్‌లను వినియోగిస్తున్నారు. పెద్దసంఖ్యలో డౌన్‌లోడ్స్‌ ఆగిపోయి.. డిస్‌ లైక్‌లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ అధికారికంగా స్పందించి కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టింది. చివరి వరకు మీ వ్యక్తిగత వివరాలు మేం రక్షణగా ఉంటామని ప్రకటించింది.

వాట్సాప్‌ ప్రకటనలో ముఖ్యమైన అంశాలు

  • ఫేస్‌బుక్‌కు వాట్సాప్‌ వివరాలు పంపుతామని అబద్ధం. ఎలాంటి వివరాలు పంచుకోం. మీ వ్యక్తిగత చాట్‌ వివరాలు ఎవరికీ తెలపం.
  • కొత్తగా ప్రైవసీ పాలసీని రూపొందిస్తున్నాం. కొత్త నిబంధనలను అంగీకరిస్తేనే వాట్సప్‌ వినియోగానికి అర్హులు. లేదంటే వారి ఖాతాను తొలగించేస్తాం.
  • కొత్తగా అప్డేట్‌ చేసిన వర్షన్‌ ఫిబ్రవరిలో అమల్లోకి తెస్తాం. 400 మిలియన్ల వినియోగదారులు వాట్సాప్‌ కు ఉన్నారు.
  • ఫేస్‌బుక్‌కు మీ పరిచయస్తుల (కాంటాక్ట్స్‌) వివరాలు పంచుకోం.
  • వ్యక్తిగత వివరాలు ఎవరికీ షేర్‌ చేయం.
  • మీ వివరాలన్నింటి విషయంలో గోప్యత పాటిస్తాం.
  • మీరు సందేశాలు కనిపించకుండా చేసుకోవచ్చు. 
  • మీరు పంపిన లోకేషన్స్‌ కూడా వాట్సప్‌ పర్యవేక్షించదు. 
మరిన్ని వార్తలు