2021 ప్రపంచ ఆటోమొబైల్ డే: టాప్-5 బెస్ట్ కార్స్

31 Jan, 2021 19:01 IST|Sakshi

"కార్ల్ బెంజ్" తన మొదటి ఆటోమొబైల్ మూడు చక్రాల మోటర్‌వ్యాగన్ కోసం సుమారు 135 సంవత్సరాల క్రితం 1886 జనవరి 29న పేటెంట్ దాఖలు చేశారు. ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకత్వం వహించడంలో "కార్ల్ బెంజ్" కీలక పాత్ర పోషించినందున ఈ రోజును 'ప్రపంచ ఆటోమొబైల్ డే'గా జరుపుకుంటారు. ఆటోమొబైల్ చరిత్రలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని ఆటోమొబైల్ ప్రియులు నమ్ముతారు. ప్రపంచ ఆటోమొబైల్ డే సందర్భంగా ప్రస్తుతం మన దేశంలో ఉన్న టాప్-5 ఉత్తమ కార్లను మీకోసం అందిస్తున్నాము. (చదవండి: పాత కారు.. టాప్‌ గేరు!)

ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే

ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఎస్‌యూవీ జర్మన్ కార్ల తయారీ కంపెనీ. ప్రస్తుతం ఇది భారతదేశంలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. పనితీరు విషయానికి వస్తే- ఆడి ఆర్ఎస్ క్యూ 8 ఇంగోల్‌స్టాడ్ ఆధారిత కార్ల తయారీదారు నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ. ఇది 592 బిహెచ్‌పి వి8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది. ఐకానిక్ నూర్‌బర్గింగ్ సర్క్యూట్ ను 7 నిమిషాల 42 సెకన్ల ల్యాప్ టైమ్‌తో తిరిగిన రికార్డు దీని పేరిట ఉంది. ఇది 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.8 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 250 కి.మీ/గం.

లంబోర్ఘిని ఉరుస్

లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని మూడేళ్ల క్రితమే భారత్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పటికి దీనిని తీసుకోవాలంటే 8-9 నెలల ముందు బుక్ చేసుకోవాల్సిందే. అంత క్రెజ్ ఉంది దీనికి. ఇది ఇటాలియన్ కి చెందిన కంపెనీ. దీనిలో అత్యధిక శక్తినిచ్చే 4.0-లీటర్ ట్విన్ టర్బో వి 8 ఇంజిన్ ఉంది. ఇది 641 బిహెచ్‌పి, 850ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.6 సెకన్ల సమయం తీసుకుంటే 200 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడానికి 12.8 సెకెన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 305 కి.మీ/గం.(చదవండి: సరికొత్తగా అమెజాన్ లోగో)
  
మసెరటి లెవాంటే

లగ్జరీ కార్ల తయారీ కంపెనీ చరిత్రలో మసెరటి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీదారు కంపెనీ. మసెరటి తన మొదటి కారు A6ను 1947సంవత్సరంలో తయారుచేసింది. ఇండియా లగ్జరీ కార్ల పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా కనిపిస్తుంది. మన దేశంలో 2018 జనవరిలో విక్రయించిన మొట్టమొదటి మసెరటి ఎస్‌యూవీ ఇది. ఈ ఎస్‌యూవీ 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 271 బిహెచ్‌పి పీక్ పవర్, 600ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లెవాంటే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 6.9 సెకన్ల సమయం తీసుకుంటుంది. ఇది 230 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళుతుంది.

పోర్స్చే 911 టర్బో ఎస్

పోర్స్చే నుంచి వచ్చిన అన్ని కార్ల కంటే 911 టర్బో ఎస్ అందరిని ఎక్కువగా ఆకర్షించింది. భారతదేశంలో ఈ శక్తివంతమైన స్పోర్ట్స్ కారు ధర రూ. 3.08 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 3.8-లీటర్, 6-సిలిండర్, ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పోర్స్చే 911 641 బిహెచ్‌పి, 800 ఎన్ఎమ్ పవర్ ఫిగర్‌ వల్ల 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు అనుగుణంగా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కారు 2.7 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే 0 నుంచి 200 కిలోమీటర్లు చేరుకోవడానికి 8.9 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం 330 కిలోమీటర్లు.  

రోల్స్ రాయిస్ ఘోస్ట్ 

రోల్స్ రాయిస్ గత సంవత్సరం భారతదేశంలో కొత్త ఘోస్ట్ యొక్క ఎక్స్టెండెడ్ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఇది బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీదారుల కంపెనీ. దీని డెలివరీలు 2021 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ కారు 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు మోటారు 563 బిహెచ్‌పి, 850 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రోల్స్ రాయిస్ కారులో సెల్ఫ్ లెవలింగ్ హై-వాల్యూమ్ ఎయిర్ సస్పెన్షన్ టెక్నాలజీతో పాటు ఆల్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్ స్టీరింగ్‌ను అందించారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 250 కి.మీ. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 4.6 సెకన్ల సమయం తీసుకుంటుంది.


 

మరిన్ని వార్తలు