Sajjan Jindal: తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన సజ్జన్‌ జిందాల్‌..!

14 Oct, 2021 13:33 IST|Sakshi

వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌(డబ్ల్యూఎస్‌ఏ) ఛైర్మన్‌గా జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జన్‌ జిందాల్‌ను ఎన్నుకున్నారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా నియమితులైన తొలి భారతీయుడిగా సజ్జన్‌ జిందాల్‌ నిలిచారు. సజ్జన్‌ ఒక ఏడాదిపాటు ఈ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌  వైస్‌ఛైర్మన్‌లుగా హెచ్‌బీఐఎస్‌ గ్రూప్‌కు చెందిన యూ యాంగ్‌, పోస్కో జియాంగ్‌ వూ చోయ్‌ సెలక్ట్‌ అయ్యారు.
చదవండి: అరేవాహ్‌...! జాతీయ రికార్డును కొల్లగొట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ..! 

ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో భాగంగా టాటా స్టీల్‌ సీఈఓ టీవీ నరేంద్రన్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌ చీఫ్‌ ఎల్‌ఎన్‌ మిట్టల్‌ ఎంపికైనారు. ఈ సంస్థకు ట్రెజరరీగా బ్లూస్కోప్‌ స్టీల్‌కు చెందిన మార్క్‌ వాసెల్లా, ఇంటర్నేషనల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫోరమ్‌ ఛైర్మన్‌గా టియోటియో డి మాలో (అపెరామ్‌) ఎన్నికయ్యారు. అంతేకాకుండా బోర్డు సభ్యులు 16 మందితో కూడిన  ఎగ్జిక్యూటివ్‌ కమిటీని నియామకం కూడా జరిగింది.  వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ సభ్యుల పదవి కాలం ఒక సంవత్సరం పాటు కొనసాగనుంది.

వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ ఉక్కు  పరిశ్రమకు కేంద్ర బిందువుగా పనిచేస్తోంది. స్టీల్‌రంగంలో ప్రభావితం చేసే అన్ని ప్రధాన వ్యూహాత్మక సమస్యలపై పరిష్కారాలను డబ్ల్యూఎస్‌ఏ చూపిస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టీల్‌ ధరలను నియంత్రిస్తోంది. దీనిని 1967లో స్థాపించారు.  ఈ సంస్థలో ఉన్న సభ్యులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 శాతం ఉక్కును ఉత్పత్తి చేస్తున్నారు. 
చదవండి: పేరు వాడితే...! రూ. 7500 కోట్లు కట్టాల్సిందే...!

మరిన్ని వార్తలు