మీ ఫండ్‌కు మీరే మేనేజర్‌..?

16 Oct, 2023 01:10 IST|Sakshi

వ్యాపారం తెలియని కంపెనీలకు దూరం

యాజమాన్య నైపుణ్యాలు బలంగా ఉండాలి

పోటీ తత్వం, పరిశోధన ఆవిష్కరణ సామర్థ్యాలు

బలమైన బ్యాలన్స్‌ షీట్‌ కీలకం

కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ముఖ్యం

మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల వైపు అడుగులు వేసే రిటైల్‌ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. అన్ని సాధనాల్లోకెల్లా ఈక్విటీలు దీర్ఘకాలంలో స్థిరమైన, మెరుగైన రాబడులు ఇవ్వడమే ఈ ఆకర్షణకు కారణం. ఈక్విటీల్లో పెట్టుబడులు ఎంత సులభమో, ఆచరణలో అంత కష్టం. నిపుణులైన ఫండ్‌ మేనేజర్లను కాదని, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపించే వారు, ప్రాథమిక విషయాల గురించి, రిస్క్‌ గురించి తప్పకుండా తెలుసుకుని తీరాలి. లేదంటే అసలు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది.

తమ పెట్టుబడులకు తామే ఫండ్‌ మేనేజర్‌ పాత్ర పోషిస్తామనుకునే వారు, ఈక్విటీలో తలపండిన వారెన్‌ బఫెట్, ఫిలిప్‌ ఫిషర్, చార్లీ ముంగర్‌ చెప్పిన సూత్రాలు పాటించడం అనుసరణీయం. కంపెనీ గురించి, చేస్తున్న వ్యాపారం గురించి, పని చేస్తున్న రంగం, యాజమాన్య దక్షత, పోటీ సామర్థ్యాలు, నిధుల బలాలు ఇలా ఎన్నో అంశాలను చూసి వడపోయాలి. ఆపై మిగిలిన కంపెనీలకే పెట్టుబడులను పరిమితం చేసుకోవడం వల్ల రక్షణ ఎక్కువగా ఉంటుంది. నేరుగా పెట్టుబడులు పెట్టే ప్రతి ఇన్వెస్టర్‌ తెలుసుకోవాల్సిన అంశాల సమాహారమే ఈ కథనం...

వ్యాపార నమూనా అర్థమైందా?
ఒక కంపెనీ షేర్లు కొంటున్నామంటే.. సదరు వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నట్టు. ఒక షేరును రూ.20లో కొని, అది రూ.100కు చేరితే నాలుగింతలు లాభం వస్తుందన్న అవాస్తవ అంచనాలు వేసుకుని ఓ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నారంటే? అనుసరించే బాట సరిగ్గా లేదని తెలుసుకోవాలి. ఎంపిక చేసుకునే కంపెనీకి ఆదాయం ఎలా వస్తోంది? కంపెనీ సేవలు లేదా ఉత్పత్తులు ఏంటన్నవి అర్థం చేసుకున్నారా? ఈ ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉండాల్సిందే.

కంపెనీ ఉత్పత్తులు లేదా సేవల గురించి తెలియనప్పుడు, భవిష్యత్తులో ఆ కంపెనీ వ్యాపారం ఎలా సాగుతుందో ఎలా తెలుస్తుంది? అటువంటప్పుడు పెట్టే పెట్టుబడి ఎలా వృద్ధి చెందుతుంది? ఒక కంపెనీ గురించి అర్థం కాకకపోయినా లేదా ఉత్పత్తులు, సేవలు ఆకర్షణీయంగా అనిపించకపోయినా, ఆ కంపెనీకి దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారం అర్థం చేసుకునేందుకు ఎంత సులభంగా ఉంటే, అంత ఆకర్షణీయమైనదిగా భావించొచ్చు.  

యాజమాన్య దక్షత
గుడ్‌ బిజినెస్‌ ఇన్‌ రాంగ్‌ హ్యాండ్స్‌.. రాంగ్‌ బిజినెస్‌ ఇన్‌ గుడ్‌ హ్యాండ్స్‌.. ఈ రెండింటిలో రెండోదే ఉత్తమం. సమర్థత లేని వ్యక్తుల చేతుల్లో మంచి వ్యాపారం ఉన్నా దాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లలేరు. అదే మంచి వ్యాపార దక్షత కలిగిన వ్యక్తులు యాజమాన్య స్థానంలో ఉంటే, చెత్త వ్యాపారాన్ని సైతం మంచిగా వృద్ధి చేయగలరు. పెట్టుబడులు పెట్టే కంపెనీకి సమర్థులైన, ప్రతిభావంతులైన, భవిష్యత్తు ప్రణాళికలు, పోటీతత్వంపై స్పష్టమైన అవగాహన, టెక్నాలజీ పట్ల ఆసక్తి కలిగిన ప్రమోటర్లు ఉండాలి.

ఆ కంపెనీ యాజమాన్యం పనితీరు గురించి సాధ్యమైనంత లోతుగా తెలుసుకోవాలి. వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో నడిచేవి, కుటుంబ కంపెనీలు సగటున ఏటా 3 శాతం అధిక పనితీరు చూపిస్తున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో ప్రమోటర్లతో సంబంధం లేకుండా నిపుణుల ఆధ్వర్యంలో గొప్పగా పనిచేసే హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్, ఎల్‌అండ్‌టీ గ్రూప్, ఐటీసీ గ్రూప్‌ కూడా ఉన్నాయి.  

మరొక ముఖ్యమైన అంశం.. ప్రతి కంపెనీ కూడా ఒక్కో రంగంలో విశేషమైన అనుభవం కలిగి ఉంటుంది. ఆయా రంగంలో వచ్చే మార్పులు, సవాళ్లకు అనుగుణంగా తన వ్యూహాలు మార్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అలా ఓ రంగానికే కట్టుబడి గొప్పగా రాణిస్తున్న కంపెనీలను పెట్టుబడులకు పరిశీలించొచ్చు. కంపెనీల మేనేజ్‌మెంట్‌ వ్యాపారంపైనే దృష్టి పెట్టాలి కానీ, వాటాదారుల విలువపై కాదు. కంపెనీ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తుంటే సహజంగానే వాటాల విలువ ఇతోధికం అవుతుంది.

వ్యాపారం కాకుండా వాటాల విలువను పెంచడంపై దృష్టి సారించే యాజమాన్యాల వైఖరి, దీర్ఘకాలంలో వాటాదారులకు మేలు చేయకపోవచ్చు. కొన్ని కంపెనీలు చేస్తున్న వ్యాపారంపై దృష్టి తగ్గించి, మార్కెట్లో వచ్చే కొత్త వ్యాపార అవకాశాల్లోకి ప్రవేశిస్తుంటాయి. వాటాల విలువ పెరుగుతుందని అలా వ్యవహరిస్తుంటాయి. దీనివల్ల నిజానికి వ్యాపార విధానం గాడి తప్పుతుంది. కొత్త వ్యాపారాల కోసం పెద్ద ఎత్తున రుణాలు సమీకరిస్తుంటాయి. ఇది కూడా వాటాదారుల విలువకు ప్రతికూలం అవుతుంది.

భవిష్యత్‌ నాయకత్వం?
ఒక గొప్ప ప్రమోటర్‌ను చూసి కళ్లు మూసుకుని ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయొచ్చని అనుభవజు్ఞలైన ఇన్వెస్టర్లు చెబుతుంటారు. నిజమే అలా ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత, ఆ గొప్ప ప్రమోటర్‌ ఏదో ఒకరోజు వయసు మళ్లో లేకుంటే ఆకస్మికంగా కాలం చేస్తే పరిస్థితి ఏమిటి? కంపెనీ సంక్షోభంలో పడిపోకుండా, ఆ తర్వాత నుంచి సమర్థవంతంగా నడిపించే నాయకుడు ఉన్నారో లేదో చూడాలి. ప్రమోటర్‌ కాకపోయినా కంపెనీలను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఎల్‌అండ్‌టీ ఏఎం నాయక్‌ వంటి నిపుణులు ఎందరో ఉంటారు. అలాంటి నిపుణుల చేతికి నాయకత్వం వెళితే నిశి్చంతగా ఉండొచ్చు.  

పనిచేస్తున్న రంగం
కంపెనీ ఏ రంగంలో పనిచేస్తుందన్నది మరో ముఖ్యమైన అంశం. ఉదాహరణకు మెటల్స్‌ తీసుకుంటే వాటి ధరలు అంతర్జాతీయంగా వివిధ దేశాల వినియోగం, ఆరి్థక పరిస్థితులకు అనుగుణంగా తీవ్ర హెచ్చుతగ్గులను చూస్తుంటాయి. స్థిరమైన రాబడి కోరుకునే వారు మెటల్స్‌కు దూరంగా ఉండాల్సిందే. అదే ఐటీ రంగం తీసుకుంటే అస్థిరతలు తక్కువ. ఎక్కువ కాలాల్లో స్థిరమైన వృద్ధిని ఏటా నమోదు చేస్తుంటాయి. అలాగే బాగా వృద్ధికి అవకాశం ఉన్న రంగాలను ఎంపిక చేసుకుంటే, ఎక్కువ కాంపౌండింగ్‌కు అవకాశం ఉంటుంది.  

పోటీతత్వం
ఎంపిక చేసుకునే కంపెనీకి గట్టి పోటీనిచ్చే సామర్థ్యాలున్నాయా? సదరు కంపెనీకి వ్యాపార పరంగా బలాలు ఉండే పెట్టుబడులకు రక్షణ ఉన్నట్టుగా భావించొచ్చు. దీన్నే మోట్‌ అని పిలుస్తారు. దీన్ని ఎలా తెలుసుకోవచ్చు? అంటే.. కంపెనీకి వ్యాపారంలో స్థూల మార్జిన్లు గరిష్ట స్థాయిలోనే దీర్ఘకాలం పాటు కొనసాగుతుంటే, ఆ కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి డిమాండ్‌ ఉన్నట్టుగా భావించొచ్చు. ఉదాహరణకు యాపిల్‌ స్థూల మార్జిన్లు 44 శాతానికి పైనే.

ఆయా వ్యాపారంలో కొన్ని కంపెనీలే పనిచేస్తుండడం, కొత్త  కంపెనీల ప్రవేశం అంత సులభం కాకపోవడం వంటివి అనుకూలతలు. దీనివల్ల ఉన్న కంపెనీలకు ప్రైసింగ్‌ పవర్‌ (ధరలను నిర్ణయించే శక్తి) ఉంటుంది. కనీసం లాభాల మార్జిన్‌ 10 శాతానికి పైన ఉండేలా చూసుకోవాలి. స్వల్ప మార్జిన్‌తో నడిచే కంపెనీలు ఎప్పుడైనా నష్టాల్లోకి జారిపోవచ్చు. పోటీ సంస్థల కంటే మీరు పెట్టుబడి పెట్టే కంపెనీ లాభాల మార్జిన్‌ ఎక్కువగా ఉండాలి. ఈ మార్జిన్‌ను ఏటేటా పెంచుకోవడం లేదంటే అదే స్థాయిలో కొనసాగించడం అవసరం. ఏటేటా క్షీణిస్తూ ఉంటే, బలం క్షీణిస్తున్నట్టుగా చూడొచ్చు.

కంపెనీ నిలబడుతుందా?
కంపెనీ రిస్క్‌లను కూడా చూడాలి. కంపెనీకి బలాలు ఉన్నాయని ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత.. అవి అలాగే కొనసాగుతున్నాయా? అని కనిపెట్టుకుని ఉండాలి. టెలికం రంగంలో ఏం జరిగిందో చూశారు కదా..? జియో రావడంతో ఎయిర్‌టెల్, వొడాఐడియా మినహా అన్నీ మూట సర్దేసుకోవాల్సి వచ్చింది. వొడాఐడియా కూడా ఆరి్థక సంక్షోభంతో కొనసాగుతోంది. ఇలాంటి విపత్తు ఏ రంగంలో అయినా ఉండొచ్చు. ఇన్వెస్ట్‌ చేసే ముందే కంపెనీకి వచ్చే రిస్‌్కల గురించి కూడా అవగాహన ఉండాలి.

ఎయిర్‌టెల్‌ కంపెనీకి నెట్‌వర్క్‌ విస్తరణ పరంగా కాస్త మెరుగైన సామర్థ్యాలు ఉన్నాయి. దీనికితోడు మారుతున్న మార్కెట్‌ పరిణామాలకు తగ్గట్టు ఎయిర్‌టెల్‌ ప్రణాళికలు రచించి, అమలు చేసుకుంటూ వెళ్లింది. అందుకే జియోకు గట్టి పోటీదారుగా నిలిచింది. ముఖ్యంగా కంపెనీకి దీర్ఘకాలిక విజన్‌ (భవిష్యత్‌ ప్రణాళిక) ఉండాలి. అలాంటి కంపెనీలు దీర్ఘకాలంలో సవాళ్లను దీటుగా ఎదుర్కొని, వాటాదారులకు విలువను సమకూర్చగలవు.  

బలమైన బ్యాలన్స్‌ షీట్‌
ఎంపిక చేసుకునే కంపెనీకి ఆరి్థక బలాలు తప్పకుండా ఉండాలి. కంపెనీకి దాదాపు రుణ భారం లేకుండా ఉంటే మంచిది. ఒకవేళ రుణాలు ఉన్నా కానీ, ఆ మొత్తం ఈక్విటీతో పోలిస్తే నూరు శాతం మించకుండా చూసుకోవాలి. రుణభారం ఎక్కువైతే కంపెనీ సంపాదించినదంతా వడ్డీ చెల్లింపులకే సరిపోతుంది. అప్పుడు కంపెనీ వృద్ధి ప్రణాళికల కోసం అప్పు మీద అప్పు చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి బ్యాలన్స్‌ షీటు కంపెనీలకు దూరంగా ఉండాలి. రుణరహిత కంపెనీలు, ఆదాయం ఏటా కనీసం 10–15 శాతం, నికర లాభం ఏటా 15–20 శాతం వృద్ధి చెందే కంపెనీల్లో పెట్టుబడికి రక్షణ, వృద్ధికి అవకాశం ఉంటుంది. ఓ కంపెనీ షేరు ధర దీర్ఘకాలంలో లాభాలనే అనుసరిస్తుంటుంది. డివిడెండ్‌  చెల్లించేవి అయితే అదనపు ప్లస్‌గా చూడొచ్చు.  

 పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యం
మారుతున్న కస్టమర్‌ అవసరాలకు అనుగు ణంగా ఉత్పత్తులు, సేవల్లోనూ నవ్యత అవసరం. అందుకే కంపెనీలు పరిశోధనపై పెద్ద మొత్తంలో వెచి్చస్తుంటాయి. ఓ కంపెనీ పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యాలకు నిదర్శనం, ఆ కంపెనీ ఉత్పత్తులకు పేటెంట్‌ హక్కులు ఉండడం. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు, సేవలను మార్కెట్‌ చేస్తుండడం. ఇలాంటి బలాలు ఉంటే, దీర్ఘకాలంలో ఆ కంపెనీ ఎంత పోటీ ఉన్నా నిలదొక్కుకుని, రాణిస్తుంది. ఇందుకు ఒక నిదర్శనం గూగుల్, యాపిల్‌. ఇవి పరిశోధనపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటాయి. ఉత్పత్తులు, సేవలపై పేటెంట్‌ ఉంటే, వ్యాపారంలో అ ధిక లాభాల మార్జిన్లకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికే ఉన్న పేటెంట్ల గడువు ముగుస్తుంటే, అది లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఉద్యోగులతో సంబంధాలు
కంపెనీలో పని విలువలు కూడా వాటాదారులకు విలువను తెచ్చి పెట్టే అంశాల్లో ఒకటి. మెరుగైన పని విధానం ఉన్న కంపెనీలు దీర్ఘకాలంలో వాటాదారులకు మంచి విలువను సమకూరుస్తాయని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కంపెనీ ఉద్యోగుల విషయంలో సముచితంగా వ్యవహరిస్తుంటే, మెరుగైన పని వాతావరణం ఉన్నప్పుడు వారు మరింత ఉత్పాదకత దిశగా పనిచేయగలరు.  

వాటాల విలువ పలుచన అవుతోందా?
కంపెనీల మూలధనం పెరుగుతూ వెళుతోందా? ఏ రూపంలో అయినా కానీయండి, దీనివల్ల అప్పటికే కంపెనీలో ఉన్న వాటాల విలువ పలుచనవుతుంది. పెట్టుబడులకు ఎంపిక చేసుకునే కంపెనీల మూలధనం స్థిరంగా ఉండాలి. షేర్ల బైబ్యాక్‌ రూపంలో ఈక్విటీ తగ్గుతుంటే ఇంకా మంచిది. దీనివల్ల వాటాదారుల విలువ ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతుంది. బ్యాంక్‌ స్టాక్స్‌కు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వొచ్చు. ఎందుకంటే బ్యాంకులకు నిధులే వ్యాపార వస్తువు. కనుక అవి తాజా ఈక్విటీ జారీ ద్వారా ఎప్పటికప్పుడు నిధులు సమీకరిస్తూ, వ్యాపార విస్తరణపై వెచి్చస్తుంటాయి.

ఇవి కూడా గమనించాలి..
► టెక్నాలజీ పరంగా కంపెనీ ముందుండాలి. కాలంతో పాటు వచ్చే మార్పులను ఆహా్వనించాలి. లేదంటే అస్తిత్వ ముప్పు ఏర్పడొచ్చు.
► కొన్ని రంగాల్లో చిన్న కంపెనీల కంటే పెద్ద కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడమే మంచిది. ఉదాహరణకు టైర్ల రంగంలో చిన్న కంపెనీని ఎంపిక చేసుకోవడం కంటే ఎంఆర్‌ఎఫ్‌ వంటి పెద్ద కంపెనీలే దీర్ఘకాలంలో రాణించేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.  
► ఓ కంపెనీ షేరు గణనీయంగా పడిపోయిందని ఇన్వెస్ట్‌ చేయడం సరికాదు. ఆ షేరు ఏ కారణాల వల్ల పడిపోయిందన్నది ముందుగా తెలుసుకోవాలి. జెట్‌ ఎయిర్‌వేస్, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్, యస్‌ బ్యాంక్‌ ఇలాంటి కేసులను అధ్యయనం చేయాలి. పడిపోతున్న షేరును కొనుగోలు చేయడం, పడిపోతున్న కత్తిని పట్టుకోవడంగా నిపుణులు చెబుతుంటారు.
► కంపెనీ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌వోఈ) దీర్ఘకాలంలో పెద్దగా వృద్ధి లేకుండా అక్కడక్కడే చలిస్తుంటే.. దీనికి బదులు ఏటేటా ఆర్‌వోఈ వృద్ధి చెందే కంపెనీలే మెరుగైన రాబడులను ఇవ్వగలవు.  
► సిమెంట్, మెటల్స్, షుగర్, ఆటోమొబైల్‌ ఇవన్నీ సైక్లికల్‌ కంపెనీలు. కొన్నేళ్ల కాలంలోనే ఎన్నో రెట్ల రాబడులు ఇచి్చన తర్వాత, మళ్లీ ర్యాలీ చేయడానికి కొన్నేళ్ల సమయం తీసుకుంటాయి. ఇలాంటి కంపెనీల్లో అధిక వేల్యుయేషన్ల వద్ద ఇన్వెస్ట్‌ చేసే ముందు ఈ అంశాలను గమనించాలి.  
► వాటాల పరంగా లిక్విడిటీ మెరుగ్గా ఉండాలి. అంటే ఫ్రీఫ్లోట్‌ మార్కెట్‌ క్యాప్‌ చెప్పుకోదగినంతగా ఉండాలి. లిక్విడిటీ తక్కువగా ఉంటే, మార్కెట్‌ కరెక్షన్లలో అమ్ముకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అమ్మకాల ఒత్తిడికే షేరు ధర భారీగా పతనం చెందుతుంది. దీంతో భారీ నష్టాలు ఎదురవుతాయి. కంపెనీ షేరు ధరను కాకుండా, అంతర్గత విలువను (ఇంట్రిన్సిక్‌ వ్యాల్యూ) చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.  
► కార్పొరేట్‌ గవర్నెన్స్‌ మెరుగ్గా ఉండాలి. కంపెనీ వ్యవహారాలు పారదర్శకంగా ఉన్నప్పుడే, మార్కెట్‌ ఆ కంపెనీకి మెరుగైన విలువను కడుతుంది. ఇనిస్టిట్యూషన్స్‌ పెట్టుబడులతో ముందుకు వస్తాయి. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ మెరుగ్గా లేని కంపెనీలకు దూరంగా ఉంటాయి. సత్యం కంప్యూటర్స్, బ్రైట్‌కామ్‌ గ్రూప్, ఈకేఐ ఎనర్జీ వంటి కంపెనీల కేసులను ఇందుకు అధ్యయనం చేయొచ్చు.  
► ప్రమోటర్ల వాటా కంపెనీలో ఎంత ఉందన్నది కూడా చూడాలి. కనీసం 20 శాతంపైన ఉంటే మంచిది. పైగా ప్రమోటర్లు తమకున్న వాటాలను తనఖా పెట్టారా? తనఖా పెట్టిన మొత్తం వారి వాటాల్లో 50 శాతం మించితే అటువంటి వాటికి దూరంగా ఉండాలి.  

స్కటిల్‌బట్‌ మెథడ్‌  ప్రకారం.. ఓ కంపెనీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉంటే, ముందు ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవలను వినియోగించుకునే వారిని కలసి మాట్లాడాలి. అలాగే, ఆ కంపెనీ పోటీదారులు, ఉద్యోగులతో మాట్లాడిన తర్వా త ఓ నిర్ణయానికి రావాలి.
– ఫిలిప్‌ ఎ. ఫిషర్‌

మరిన్ని వార్తలు