Zomato: జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చిందిగా... కానీ ఇక్కడో ట్విస్ట్‌

23 Aug, 2022 11:22 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చింది...కాదు కాదు..మరో కొత్త స్కీంతో కస్టమర్లను ఆకర్షించనుంది. ఈ నేపథ్యంలోనే  లాయల్టీ ప్రోగ్రామ్​ ‘జొమాటో ప్రో’ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.  ఈ స్కీం కింద ఇక కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు, ఫ్రీడెలివరీ లాంటి ఫెసిలిటీలు రద్దు అన్నమాట.

కస్టమర్‌ అడిగిప్రశ్నకు సమాధానంగా ట్విటర్‌లో స్పందించిన జొమాటో ‘జొమాటో ప్రో’ సేవలపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. గడువు ముగిసిన ప్రో మెంబర్‌‌షిప్‌‌ను రెన్యువల్​ చేయడం కుదరదని జొమాటో తెలిపింది.  దీనికి వెనుకకారణాలను మాత్రం జొమాటో స్పష్టం  చేయలేదు.  జొమాటో ప్రో, ప్లస్‌ లకు  కొత్తగా సభ్యత్వం ఇవ్వడం లేదు. అయితే ఇప్పటికే మెంబర్‌షిప్‌ వాలిడిటీ  ఉన్నవారు తమ  ప్రయోజనాలు యధావిధిగా పొందుతారు. సభ్యత్వ  గడువు ముగిసిన తర్వాత, దాన్ని పొడిగించలేరు/ పునరుద్ధరించలేరు అని జొమాటో ప్రతినిధి తెలిపారు.

(Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్‌ విషయాలు)

ఇటీవలికాంలో జొమాటో రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. నిన్నగాక మొన్న హృతిక్ రోషన్ యాడ్‌కు సారీ చెప్పిన జొమాటో 'ప్రో' అనే మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను నిలిపివేయడం విశేషం. ఇప్పటికే  ప్రో ప్లస్‌కు గుడ్‌ బై చెప్పేసింది. అలాగే క్రెడిట్ కార్డ్ నిబంధనలను కూడా సవరించిన సంగతి తెలిసిందే. 

(పండుగ సీజన్‌: డిపాజిటర్లకు బ్యాంకుల బంపర్‌ ఆఫర్‌)

మరోవైపు తన వినియోగదారుల కోసం  "కొత్త ప్రోగ్రామ్"ను లాంచ్‌ చేయనుందట. అప్‌డేట్ చేసిన ప్రోగ్రామ్‌తో మెరుగైన సేవలందిస్తామని,  మరిన్ని ఆఫర్‌లు/అప్‌డేట్స్‌ కోసం వేచి ఉండాలంటోంది. దీనికోసం కస్టమర్లతో, రెస్టారెంట్ భాగస్వాములతో ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని పేర్కొంది.  కొత్త ప్రోగ్రాం టైమ్‌లైన్‌ను పేర్కొనలేం గానీ  రావడం పక్కా  అని తెలిపింది.  (ఇదీ చదవండి: వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్‌)

>
మరిన్ని వార్తలు