banjara Hills: కొంత కాలంగా ప్రవర్తనలో మార్పు. మార్చుకోవాలని చెప్పడంతో

3 Nov, 2021 09:28 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఇందిరానగర్, వీధి నంబర్‌ 16లో నివసించే కె. భవానీ(23) తన పుట్టిన రోజు సందర్భంగా దైవ దర్శనానికి వెళ్లి సాయంత్రమైనా రాలేదు. దీంతో తండ్రి కె.నగేష్‌ తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

మరో ఘటనలో.. 
బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఇందిరానగర్‌లో నివసించే ప్రసన్న(25) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. పోలీసుల సమాచారం మేరకు ప్రసన్న ఇందిరానగర్‌లో ఆమె కుటుంబం ఉంటున్నది. కొంత కాలంగా ప్రసన్న ప్రవర్తనలో తీవ్ర మార్పు రాగా అత్త పలుమార్లు ప్రవర్తన మార్చుకోవాలని కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చింది. ఆమె వినిపించుకోకుండా గత నెల 31వ తేదీన అర్ధరాత్రి 11 గంటలకు అత్త నిద్రిస్తున్న సమయంలో చెప్పకుండా బయటికి వెళ్లిపోయింది. అన్ని ప్రాంతాలు గాలించినా ఫలితం లేకపోవడంతో తన భార్య కనిపించడం లేదంటూ భర్త రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

కె.భవాని 

మరిన్ని వార్తలు