-

కర్నూలులో ‘నారాయణ’ వీడియోల కలకలం.. స్పై కెమెరాతో రికార్డు చేసి..

28 Nov, 2023 09:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అక్కడ పనిచేసే కొందరు మహిళలతో తన కార్యాలయంలోనే కోర్‌ డీన్‌ కామ క్రీడలు

ఆ వ్యవహారాలను స్పై కెమెరాతో రికార్డు చేసి.. డీన్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఉద్యోగులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన డీన్‌ లింగేశ్వరరెడ్డి

కర్నూలు సిటీ: ఇప్పటి వరకూ నారాయణ విద్యా సంస్థల్లో ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు, సరైన భోజనం, సౌకర్యాలు లేక విద్యా­ర్థులు అవస్థలు పడుతున్న ఘటనలే వెలుగు చూశాయి. తాజాగా ఉద్యోగి రాసలీలల వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల కోర్‌ డీన్‌ లింగేశ్వరరెడ్డి ఆక్కడ పనిచేసే కొందరు మహిళలతో జరిపిన రాసక్రీడల వీడియోల వ్యవహారం చర్చనీయాంశమైంది. నారాయణ విద్యాసంస్థల కోర్‌ డీన్‌ లింగేశ్వరరెడ్డి.. జూనియర్‌ కాలేజీల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలో తన కార్యాలయంలోనే అక్కడి మహిళలతో ఆయన సాగిస్తున్న సరస సల్లాపాలను గమనించిన అక్కడ పనిచేసే గోపీకృష్ణ, నజీర్‌ అనే ఉద్యోగులు ఆ గదిలో స్పై కెమెరాలు అమర్చారు. ఇందులో పదుల సంఖ్యలో రాసలీలల వీడియోలు రికార్డయ్యాయి. గోపీకృష్ణ, నజీర్‌లు ఆ వీడియోలను డీన్‌ లింగేశ్వరరెడ్డి వాట్సాప్‌కు పంపగా.. వారిని రాజీకి పిలిపించి ఒక ఇల్లు, రెండు విలువైన ప్లాట్లు వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. అంతేగాక వారి వేతనాలు కూడా పెంచేందుకు హామీ ఇచ్చారు. 

మరికొంత మంది బ్లాక్‌మెయిల్‌ 
తర్వాత ఆ వీడియోలు ఓ ఉద్యోగి ద్వారా నబీ రసూల్‌ అనే వ్యక్తికి చేరాయి. ఇతను చంద్రశేఖరరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి అనేవారికి వీడియోలను పంపడంతో వారు లింగేశ్వరరెడ్డి వద్ద డబ్బులు డిమాండ్‌ చేశారు. వీరితోనూ రాజీకి వెళ్లి పెద్ద మొత్తంలో నగదు ఒప్పందం చేసుకున్నారు. కొంత డబ్బులు ఇచ్చి, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో తిరిగి వీళ్లు ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేయసాగారు.

దీంతో ఇంకెంతమంది ఇలా బ్లాక్‌ మెయిల్‌ చేస్తారోనని భయంతో లింగేశ్వరరెడ్డి స్పందనలో ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. దీంతో తాలూకా పోలీస్‌స్టేషన్‌కు బ్లాక్‌మెయిలర్స్‌ను పిలిపించి సెల్‌ఫోన్‌లు తీసుకుని వారి దగ్గర ఉన్న వీడియోలను డిలీట్‌ చేయించి వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. ఆయన ఆస్తులను కూడా తిరిగి అతని పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు.

నిందితులను కర్నూలు రూరల్‌ తహసీల్దార్‌ ఎదుట హాజరు పరిచి బైండోవర్‌ కేసు నమోదు చేయించారు. తనను బ్లాక్‌ మెయిల్‌ చేసిన ఉద్యోగులను కోర్‌ డీన్‌ హైదరాబాద్‌కు బదిలీ చేయించారు. తనను కొందరు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని లింగేశ్వరరెడ్డి స్పందనలో ఫిర్యా­దు చేయడంతో విచారించి నిందితులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌ చెప్పారు. బాధితులు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: విశాఖ జూ పార్క్‌లో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి

మరిన్ని వార్తలు