మన్యంలో మరణమృదంగం

19 Jan, 2021 11:48 IST|Sakshi
కంకణాపల్లి గ్రామం

సాక్షి, పాచిపెంట(శ్రీకాకుళం): మండలంలోని గిరిజన గ్రామాల్లో వింత వ్యాధులు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధి పేరు తెలియదు.. ఎందుకు వ్యాపిస్తుందో తెలియదు.. ఏం చికిత్స తీసుకోవాలో తెలియదు.. ఇంతలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మండలంలోని చిల్లమామిడి తరహాలోనే కర్రివలస పంచాయతీ కంకణాపల్లిలో కూడా వరుస మరణాలు నమోదవుతున్నాయి. కంకణాపల్లి 70 ఇళ్లలో సుమారు 300 మంది గిరిజనులున్నారు. ఏడాది కాలంలో కాళ్లు, చేతులు పొంగి 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గతంలో చిల్లమామిడిలో వింత వ్యాధితో పలువురు మృతి చెందడంతో అధికారులు స్పందించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. తమ గ్రామంలో కూడా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని కంకణాపల్లి వాసులు కోరుతున్నారు. చదవండి: కొండ దిగిన కోదండరాముడు

ఏడుగురు.. 
రెండు నెలల వ్యవధిలో ఏడుగురు ఒకే రకమైనా వ్యాధి లక్షణాలతో మృతి చెందారు. కాళ్లు, చేతులు, ముఖం పొంగిపోవడంతో బాగా నీరసించిపోతున్నారు. కొద్దిరోజుల్లోనే మృత్యువాత పడుతున్నారు. గ్రామానికి చెందిన  గెమ్మెల రామకృష్ణ (20) గెమ్మెల పాల్స్‌ (35), చోడిపల్లి నరసయ్య (60), గెమ్మెల కుమారి (35), కోనేటి ఆనిల్‌ (25), గెమ్మెల సుకరయ్య (55), గెమ్మెల మంగులమ్మ (45) రెండు నెలల వ్యవధిలోనే చనిపోయారు. చదవండి: పశ్చిమ గోదావరిలో వింతవ్యాధి కలకలం 

>
మరిన్ని వార్తలు