-

సెల్ఫీ దిగిన 13 నిమిషాలకే విషాదం..

28 Nov, 2023 12:18 IST|Sakshi
ప్రమాదానికి ముందు సెల్ఫీ తీసుకున్న మృతులు

గోపాలపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రంజన్‌ కుమార్‌ (22), రోహిత్‌ (24) అక్కడి నుంచి మోటార్‌ సైకిల్‌పై అన్నవరం బయలుదేరారు. సోమవారం గోపాలపురం మండలం కరిచర్లగూడెం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రంజన్‌కుమార్‌ అక్కడిక్కడే మృతి చెందాడు.

కొన ఊపిరితో ఉన్న రోహిత్‌ను గోపాలపురం సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై కె.సతీష్‌ కుమార్‌ తెలిపారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్సీ పి.జగదీష్‌ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు