దారుణం: పిల్లల కోసం మహిళను నిర్బంధించి 16 నెలలుగా లైంగిక దాడి

12 Nov, 2021 20:58 IST|Sakshi

భోపాల్: సంతానం కోసం ఓ మ‌హిళను 16 నెల‌ల పాటు నిర్బంధించి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. అనంతరం ఆమె ఓ బిడ్డ‌కి జన్మనిచ్చిన తరువాత ఆమెను  సమీపంలోని బస్టాప్ దగ్గర వదిలి వెళ్ళాడు.ఈ దారుణ ఘటన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినిలో చోటుచేసుకుంది. దీనికి కారకుడైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. ఉజ్జయినీలోని క‌ధ్ బ‌రోడా గ్రామానికి చెందిన ఆ గ్రామ మాజీ ఉప స‌ర్పంచ్ రాజ్‌పాల్ సింగ్ మ‌ధ్య‌వ‌ర్తుల సాయంతో 16 నెల‌ల కింద‌ట ఓ మ‌హిళను కొనుగోలు చేసి ఉజ్జ‌యినికి తీసుకువ‌చ్చాడు.

అంతే గాక తన భార్య సహాయంతో బాధితురాలిపై అతను ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. కాగా సింగ్ దంప‌తుల ఇద్ద‌రు పిల్లలు మ‌ర‌ణించ‌డంతో వాళ్ళు  బాధితురాలి ద్వారా ఓ బిడ్డను పొందాలని ఈ దారుణానికి ఒడగట్టారు. బాధితురాలు అక్టోబ‌ర్ 25న ఓ శిశువ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో స్పృహలో లేని ఆమెను నిందితుడు సింగ్ బ‌స్టాండ్ వ‌ద్ద వ‌దిలి వెళ్లాడంతో ఈ ఘటన వెలుగు చూసింది.స్పృహలోకి వ‌చ్చిన అనంత‌రం బాధితురాలు నిందితుడి నిర్వాకాన్ని పోలీసుల‌కు తెలిపింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: అసలేం జరిగింది? సూసైడ్ నోట్‌ రాసి ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య

మరిన్ని వార్తలు