తిడతారనే భయంతో బాలుడి హత్య..

26 Oct, 2020 13:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శామీర్‌ పేట్‌ బాలుడు అదియాన్‌ మృతి కేసు కొలిక్కి వచ్చింది. అదియాన్‌తో కలిసి షేర్‌చాట్‌లో వీడియోలు చేసే ఓ మైనర్‌ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ నర్సింగ్‌ రావు సోమవారం మీడియాకు తెలియజేశారు. ‘‘చనిపోయిన 5 ఏళ్ల బాబుతో నిందితుడు షేర్ చాట్లో వీడియోలు చేస్తుండేవాడు. బాలుడు జంప్ చేస్తుండగా అతడి తలకు గాయాలు అయ్యాయి. గాయాలు చూస్తే అదియాన్ తల్లిదండ్రులు తిడతారనే భయంతో బాబు గొంతు నులిమి చంపేశాడు. ( కిలాడీ లేడీ.. 30 ఏళ్లుగా.. )

చంపిన తర్వాత శవాన్ని గోనెసంచిలో కుక్కి, అర్ధరాత్రి వేళ నడుచుకుంటూ వచ్చి ఓఆర్‌ఆర్‌ పక్కన పొదల్లో పడేశాడు. రెండు రోజుల తర్వాత బాబు తల్లిదండ్రులకు కాల్ చేసి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ నెంబర్, సీసీ కెమెరా ఆధారంగా కేసును ఛేదించాం. డబ్బులు ఇవ్వగానే బిహార్ పారిపోదామని నిందితుడు ప్లాన్ చేశాడు. నిందితుడు మైనర్, 20 రోజుల క్రితమే ఇంట్లో అద్దెకు వచ్చాడ’’ని అన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా