హస్కి వాయిస్‌.. న్యూడ్‌ వీడియో కాల్స్‌ చేయించుకోని..

16 Nov, 2021 10:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి, ఆపై న్యూడ్‌ వీడియోకాల్‌ చేపించుకుని నగర వాసి నుంచి డబ్బులు వసూలు చేశారు సైబర్‌ నేరగాడు. క్యాప్చర్‌ చేసిన వీడియోను అడ్డుపెట్టుకుని పలు దఫాలుగా పెద్ద మొత్తంలో లక్షలు వసూలు చేయడంతో..బాధితుడు న్యాయం కావాలంటూ సిటీ సైబర్‌ క్రైం పోలీసుల్ని సోమవారం ఆశ్రయించాడు. ఎస్సై నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల నగర యువకుడికి ఓ వ్యక్తి అమ్మాయిల వాట్సప్‌లో పరిచయమయ్యాడు.

సాంకేతికను అడ్డం పెట్టుకుని పలుమార్లు అమ్మాయి గొంతుతో మాట్లాడారు.. దుస్తులు ధరించినవి, దుస్తులు లేకుండా(న్యూడ్‌) ఉన్న ఫొటోస్‌ని పంపి యువకుడికి గాలం వేశారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు వాట్సప్‌ వీడియో కాల్‌ చేపించుకున్నారు. అవతలి వ్యక్తి కనిపించకుండానే..యువకుడిని దుస్తులు విప్పాలన్నారు. ఆపై యువకుడి వీడియోను రికార్డ్‌ చేశారు. తదనంతరం డబ్బులు డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే నీ న్యూడ్‌ వీడియోను వాట్సప్‌ గ్రూపుల్లో షేర్‌ చేయడంతో పాటు..యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తామని బెదిరించారు.

దీంతో వారు చెప్పిన విధంగా యువకుడు పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.4లక్షలు పంపాడు. ఎంత పంపినా తీసుకుంటున్నారే కానీ..వీడియో డిలీట్‌ చేయడం లేదని, మరికొన్ని డబ్బులు కావాలని వేధిస్తుండటంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి తాము దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు