కొత్తగా పెళ్లయిన కమెడియన్‌ జంటకు షాకిచ్చిన పోలీసులు

6 May, 2021 17:21 IST|Sakshi

జలంధర్‌: కపిల్‌ శర్మ షోతో పాపులరైన హాస్య నటికి పంజాబ్‌ పోలీసులు షాకిచ్చారు. పెళ్లయిన 9 రోజులకు పోలీసులు ఆ నవ దంపతులపై కేసు నమోదు చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విధించిన నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారిపై కేసు నమోదు చేశారు. మాస్క్‌ ధరించకపోవడం.. పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు వివాహ వేడుకకు వచ్చారని పోలీసులు గుర్తించారు. 

హాస్యనటుడు, గాయకుడు సంకేత్‌ భోస్లేకు సుగంధ మిశ్రాను వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లి సమయంలో కరోనా జాగ్రత్తలు పాటించలేదు. దీన్ని ఓ వీడియో ద్వారా గుర్తించిన అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు.  విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం 188 సెక‌్షన్‌ కింద వారిపై కేసు బుక్‌ చేశారు. పంజాబ్‌లోని  జలంధర్‌కు చెందిన గాయని సుగంధ మిశ్రాను అదే ప్రాంతంలోని ఓ ఫంక‌్షన్‌ హాల్‌లో ఏప్రిల్‌ 26వ తేదీన వివాహం జరిగింది.

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం వివాహాలు, శుభకార్యాలపై నిబంధనలు విధించింది. 10 మంది కన్నా అధికంగా ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాహ వేడుకలో పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు పాల్గొన్నారని ఓ వీడియోలో పోలీసులు గుర్తించారు. ఆ వీడియో ఆధారంగా ఆ నవ దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సరబ్‌జిత్‌ సింగ్‌ బహియా తెలిపారు. పగ్వారా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది.

చదవండి: కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు 

A post shared by 𝐒𝐔𝐆𝐀𝐍𝐃𝐇𝐀 𝐌𝐈𝐒𝐇𝐑𝐀 (@sugandhamishra23)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు