‘నన్ను క్షమించండి’.. వాట్సప్‌లో స్టేటస్‌ పెట్టి పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య!

1 Apr, 2023 15:07 IST|Sakshi

చెన్నై: ఏం జరిగిందో ఏమో గానీ పీహెచ్‌డీ పట్టా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలన్న తపన పడ్డ ఓ విద్యార్థి అర్థాంతరంగా జీవితాన్ని ముగించాడు. కొడుకు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం ఇంటికి వస్తాడనే ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాడు.

ఐఐటీ మద్రాస్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి శుక్రవారం వేలచేరిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయు ముందు తన వాట్సాప్‌లో ఈ విధంగా స్టేటస్‌ పెట్టుకున్నాడు... ‘‘ఇది సరిపోదు.. నన్ను క్షమించండి’ అని రాశాడు. విద్యార్థి 32 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ సచిన్ కుమార్ జైన్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జైన్, ఐఐటీ మద్రాస్‌లోని గిండీ క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎప్పటిలానే తన రెగ్యులర్ క్లాస్‌లకు హాజరయ్యాడు.

అయితే ఆ తరువాత ఏం జరిగిందో గానీ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తన నివాసానికి తిరిగి వెళ్లిపోయాడు. గంట సేపు నుంచి జైన్‌ ఎవరికి కనిపించకపోవడంతో అతని స్నేహితులు వెతకడం ప్రారంభించారు. క్యాంపస్‌ మొత్తం ఎంత సేపు వెతికిన ఆచూకి తెలియరాలేదు. దీంతో జైన్‌ స్నేహితులు చివరకి అతని ఇంటికి వెళ్లి చూడగా..  డైనింగ్ హాల్‌లో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే అతని స్నేహితులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే ఆసుపత్రిలోని సిబ్బంది అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. 

మరిన్ని వార్తలు