భర్తను సజీవ దహనం చేసిన భార్య 

22 Oct, 2020 10:09 IST|Sakshi

హత్యల కలకలం

మిత్రుడ్ని కడతేర్చిన ఆటోడ్రైవర్‌

తండ్రి కోసం పెద్దనాన్నను హతమార్చాడు

సాక్షి, చెన్నై : రాష్ట్రంలో బుధవారం వేర్వేరు చోట్ల వెలుగు చూసిన హత్యలు ఆయా ప్రాంతాల్లో కలకలం రేపాయి. చెన్నై తురై పాక్కం కన్నగి నగర్‌కు చెందిన ఆట్రోడ్రైవర్‌ రఘు, మైలాపూర్‌కు చెందిన కార్తీక్‌ స్నేహితులు. అయితే, భార్య వినోదిని(21)తో కార్తీక్‌తో సాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని పసిగట్టిన రఘు వేకువజామున తాను లేననుకుని ఇంటికి వచ్చిన కార్తిక్‌ను,  రఘు హతమార్చాడు. చదవండి: ప్రియుడిని కలవడానికి నిరాకరించినందుకు ..

తండ్రి కోసం.. 
తిరునల్వేలి జిల్లా తచ్చనల్లూరుకు చెందిన సుడలైమణి(55), షణ్ముగవేల్‌(52) అన్నదమ్ముళ్లు. ఆస్తి కోసం తండ్రికి సుడలైమణి చేతబడి చేసినట్టు షణ్ముగవేల్‌ కుమారుడు ముత్తుమారి కొంతకాలంగా గొడవ పడుతూ కక్ష గట్టాడు. ఉదయం గ్రామ శివార్లలో ఒంటరిగా కనిపించిన సుడలైమణిని మారిముత్తు నరికి చంపేశాడు. చదవండి:  తరచూ ఫోన్‌ చేసి భార్యను వేధిస్తున్నాడని..

డ్రమ్ములో హిజ్రా శవం.. 
కోవై జిల్లా హిజ్రాల సంఘం నేతగా సంగీత(50) వ్యవహరిస్తున్నారు. హిజ్రాల్ని ఏకం చేసి ట్రాన్స్‌ కిచ్చన్‌ పేరిట బిర్యానీ సెంటర్‌ను నడుపుతూ వస్తున్న సంగీత ఆమె ఇంట్లో ఓ డ్రమ్ములో శవంగా తేలింది. కోయంబత్తూరు రత్నగిరికి చెందిన పెరియస్వామి(46) రాంగ్‌ కాల్‌లో తగిలిన ఓ మహిళతో పరిచయం పెంచుకునేందుకు తీవ్రంగా యత్నించాడు. కారమలైకు చెందిన వితంతువు ధనలక్ష్మిగా గుర్తించాడు. ప్రతిరోజూ రాత్రుల్లో సిమ్‌ కార్డుల్ని మారుస్తూ, ఫోన్‌చేసి అశ్లీల వ్యాఖ్యలు చేయడం, కోరిక తీర్చాలని వేధించడం మొదలెట్టాడు. దీంతో విషయాన్ని తన తల్లి మల్లిక, బంధువు లక్ష్మణన్‌ దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం అర్ధరాత్రి  పథకం ప్రకారం పెరియస్వామి ఇంటికి రప్పించుకున్న ధనలక్ష్మి తన తల్లి, బంధువుతో కలిసి చెట్టుకు కట్టేసి చితక్కొట్టింది. దీంతో పెరియస్వామి విగత జీవి అయ్యాడు.  

పెట్రోల్‌ పోసి తగలబెట్టింది... 
ఈరోడ్‌ వలరసం పట్టికి చెందిన సుధాకర్‌(40)ను అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి గత ఏడాది రెండో పెళ్లి చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను సుధాకర్‌పై పోసి తగలబెట్టేసింది. అతడు సజీవ దహనం కావడం, ఇంట్లో నుంచి పొగరావడంతో ఇరుగు పొరుగు పరుగులు తీశారు. దీంతో లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసి, ఆస్పత్రి పాలైంది.  

తండ్రి ఆత్మహత్య 
టీ.నగర్‌: కుమారుడు మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగపట్నం జిల్లా, శీర్గాళి సమీపంలోగల సంజీవరాయన్‌ కోవిల్‌ గ్రామానికి చెందిన శేఖర్‌ (48) రైతు. భార్య తమిళరసి.. వీరి కుమారుడు సంతోష్‌ (27). ఈనెల తొమ్మిదో తేదీన చెన్నైకు వెళుతున్నట్లు తెలిపి బయలుదేరాడు. ఈ క్రమంలో 10న కడలూరు జిల్లా చిదంబరం సమీపం పి.ముట్లూరు ప్రాంతంలో సంతోష్‌ హత్యకు గురయ్యాడు. కుమారుడు మృతిని తట్టుకోలేక శేఖర్‌ మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి తమిళరసి అనే భార్య ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు