ఘాట్‌రోడ్‌లో ఆటో బోల్తా

1 Jun, 2022 11:22 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

సీతంపేట: వివాహ శుభకార్యానికి వెళ్లి మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసుకుని  అనంతరం ఆటోలో తిరుగుప్రయాణమై వస్తుండగా మార్గమధ్యంలో అదుపు తప్పి ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా పడడంతో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురికి   తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యకోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మిగతా 14 మంది స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని చింతాడలో ఓ వివాహ శుభకార్యానికి మెళియాపుట్టి మండలం బాణాపురం గ్రామానికి చెందిన 16 మంది ఆటోలో వచ్చి  తిరుగు ప్రయాణమయ్యారు. గెడ్డగూడ సమీపంలో ఘాట్‌ రహదారి వద్ద ఆటో దిగుతుండగా ముందు ద్విచక్రవాహనంపై ఇద్దరు వెళ్తున్నారు. ఎదురుగా మరో ఇద్దరు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. ఆటోలో ఉన్న 16 మందితో పాటు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న నలుగురు గాయపడడంతో వెంటనే ఐటీడీఏ ప్రత్యేక అంబులెన్స్‌లో స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: కోవిడ్‌ బాధిత బాలలకు ప్రభుత్వం అండ)

మరిన్ని వార్తలు