భార్య వేధింపులు తాళలేక... 

7 Sep, 2022 08:50 IST|Sakshi

యశవంతపుర: భార్య వేధింపులను తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా జయపుర గ్రామంలో జరిగింది. అరవింద్‌ (42) తన తోటలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు డెత్‌నోట్‌ రాసి తన మరణానికి భార్య, ఆమె బంధువులు, పోలీసుల పేర్లు రాశాడు. 12 ఏళ్ల క్రితం అరవింద్‌తో రేఖనిచ్చి వివాహం చేశారు. రోజు ఏదో విషయంపై గొడవ పడేవారు.

ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో రేఖ బంధువులు ఇటీవల జయపుర స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దీంతో విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. జయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త చేతిలో భార్య హతం : కుటుంబ కలహాలతో భర్త భార్యను హత్య చేసిన ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా చీకనహళ్లి గ్రామంలో మంగళవారం జరిగింది.

ఇంద్రమ్మ (48)ను ఆమె భర్త చంద్రేగౌడ నలుగురితో కలిసి హత్య చేసి పరారయ్యాడు. అడ్డుపడిన మహిళలపై కూడా నిందితులు దాడి చేశాడు. ఆరు నెలల క్రితం చంద్రమ్మను హత్య చేయటానికి పథకం వేయగా ఆమె తప్పించుకుంది. పుట్టినిల్లు చీకనహళ్లిలో ఉంటూ కూలీ పనులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

(చదవండి: హెలికాప్టర్‌ సర్వీస్‌ రూ. 17 వేలు టోపి)

మరిన్ని వార్తలు