వరదలో గల్లంతైన బీటెక్‌ విద్యార్థిని మృతి

14 Oct, 2020 15:31 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో గల్లంతైన బీటెక్‌ విద్యార్థిని మృతి చెందింది. మంగళవారం పోచంపల్లి- కొత్తగూడెం మార్గం మధ్యలో బీటెక్‌ విద్యార్థిని భోగ వైష్ణవి(17) వరద నీటిలో గల్లంతైంది. గల్లంతైన విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం విగత జీవిగా దర్శన మిచ్చింది. వైష్ణవి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ( వ‌ర‌ద బీభ‌త్సానికి అద్దం ప‌డుతున్న దృశ్యం )

కాగా, తెలంగాణలో వర్ష బీభత్సానికి దాదాపు 12 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగగా.. పలు నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, పలు ప్రాంతాలు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. వీధుల్లోని కార్లు, ఆటోలు, బైక్‌లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు